Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్ రావు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, టీవీ చానల్ అధినేత శ్రవణ్ రావు శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. శ్రావణ్ రావును విచారిస్తే ఈకేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, టీవీ చానల్ అధినేత శ్రవణ్ రావు శనివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విచారణ బృందం శ్రవణ్ రావుకు విచారణకు హాజరు కావాలని ఈనెల 26న నోటీసులు జారీ చేసింది. దీంతో శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. శ్రావణ్ రావును విచారిస్తే ఈకేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈకేసులో తాజాగా శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా..పోలీస్ విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. అలాగే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవద్ధని సూచించింది. చట్ట పరిధిలో విచారించాలని స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు లపై ఇప్పటికే పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. 2024మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే వారిద్ధరు అమెరికాకు వెళ్లి తలదాచుకుంటున్నారు. కేసు విచారణ నిమిత్తం వారిని ఇండియా రప్పించే ప్రయత్నాల్లో రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడంతో అనూహ్యంగా శ్రవణ్ రావు సుప్రీంకోర్టును, ప్రభాకర్ రావు హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారిద్ధరు పోలీసు విచారణకు హాజరైన పక్షంలో కేసు కీలక మలుపులు తిరగుతుందని విశ్లేషిస్తున్నారు.