కృష్ణంరాజుకి ఆయ‌న మొద‌టి భార్య అంటే ఎన‌లేని ప్రేమ‌..రెండో పెళ్లి ఎలా జ‌రిగిందంటే..!

కృష్ణంరాజుకి ఆయ‌న మొద‌టి భార్య అంటే ఎన‌లేని ప్రేమ‌..రెండో పెళ్లి ఎలా జ‌రిగిందంటే..!

రెబల్ స్టార్ కృష్ణం రాజు తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.అప్ప‌టి త‌రం న‌టుల్లో అగ్ర‌గామిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు 180కి పైగా చిత్రాల్లో నటించారు. ప‌శ్చిమ గోదావరి జిల్లా మెగల్తూరులో పుట్టిన కృష్ణం రాజు సినిమాల‌తో పాటు రాజకీయాల్లో కూడా త‌న స‌త్తా చూపించారు. గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్‌పై పలు సినిమాలు తెరకెక్కించారు. ఇక త‌న వార‌సుడిగా ప్ర‌భాస్‌ని ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చి తెగ మురిసిపోయాడు. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ద‌క్కించుకోవ‌డంతో కృష్ణం రాజు ఆనందం అంతా ఇంతా కాదు. ఆయ‌న పలు అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న కృష్ణంరాజు 2022లో సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. జనవరి 20వ తేదీ ఆయన జయంతి సందర్భంగా సతీమణి శ్యామలా దేవీ పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

కృష్ణంరాజుని మీరు రెండో పెళ్లి ఎలా చేసుకున్నారు అని ప్ర‌శ్నించ‌గా, దీనికి శ్యామ‌లా దేవి స్పందిస్తూ.. ‘కృష్ణం రాజు తన మొదటి భార్య సీతాదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ప్రేమ‌గా కూడా చూసుకున్నారు. అయితే కంచి షాపింగ్‌కి వెళుతున్న స‌మ‌యంలో కార్ యాక్సిడెంట్‌తో ఆమె చ‌నిపోయింది. ఆ స‌మ‌యంలో కృష్ణంరాజు చాలా కుంగిపోయారు. అయితే కృష్ణంరాజు ఆవేద‌న‌ని ఆయ‌న త‌ల్లితండ్రులు చూడ‌లేక‌పోయారు. నా కొడుక్కి ఎవ‌రైన మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని వారు అనుకున్నారు. కాని ఏ అమ్మాయిని ఇచ్చి చేయాల‌నే సందిగ్ధ‌త వారిలో ఉండేది.

అయితే ఒకానొక స‌మ‌యంలో నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల‌ని కృష్ణంరాజుని ఆయ‌న తండ్రి కోరారు. దానికి ఆయ‌న నిరాక‌రించారు. దీంతో తండ్రి భోజనం మానేసి.. ఊ అన్న రోజే తింటానని నిరాహార దీక్ష చేయడంతో ఒప్పుకున్నారట. అలా సంబంధాలు వెతకడం స్టార్ చేశారు. నాకు చిన్నప్పుడు పూజలు, భక్తి ఎక్కువ. మా అమ్మ దానం, ధర్మం గురించి మాట్లాడుకునేటప్పుడు కృష్ణం రాజు గొప్ప వ్యక్తి అని, ఆయన ధాన ధర్మాలు చేస్తారని న‌లుగురు చెప్పుకునే వారు. అలా మా చుట్టాల ద్వారా కృష్ణంరాజు సంబంధం మా ద‌గ్గ‌ర‌కు రావ‌డం జరిగింది. అయితే ఈ సంబంధం మా అమ్మకు ఇష్టం లేదు. నన్ను అడిగారు.. నేను వెంటనే ఒప్పేసుకున్నా’ అని చెప్పాను అని శ్యామ‌లా దేవి తెలిపారు.అయితే నాతో బల‌వంతంగా ఒప్పించారేమోన‌ని వారు అనుకున్నారు. సీక్రెట్‌గా తన కజిన్‌ని పంపించి అడ‌గ‌గా, నాకు ఇష్టం అని చెప్ప‌డంతో పెళ్లి చేసుకున్నార‌ని తెలియ‌జేసింది శ్యామ‌ల