ముద్దు విష‌యంలో అబ‌ద్ధం చెప్పిన శ్రీలీల‌.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్

  • By: sn    breaking    Oct 29, 2023 11:34 AM IST
ముద్దు విష‌యంలో అబ‌ద్ధం చెప్పిన శ్రీలీల‌.. ఆడేసుకుంటున్న నెటిజ‌న్స్

శ్రీలీల‌.. ఇప్పుడు ఈ అమ్మ‌డు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పెళ్లి సంద‌డి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ధ‌మాకా చిత్రంతో తొలి హిట్ అందుకున్న శ్రీలీల ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. రీసెంట్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరిలో నటించి మరో బంపర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇందులో కీల‌క పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది శ్రీలీల. భగవంత్ కేస‌రి చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో శ్రీలీల యాక్టివ్ గా పాల్గొన‌డం మ‌నం చూశాం. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తూ ఆసక్తికర విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది శ్రీలీల‌.

అయితే ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సన్నివేశాల మీద నీ అభిప్రాయం ఏమిటీ? లిప్ కిస్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తావు? అని అడ‌గ‌డంతో ఈ అమ్మ‌డు కాస్త తెలివైన‌ సమాధానం చెప్పింది. వెండితెర‌పై ముద్దు స‌న్నివేశాల‌లో న‌టించ‌న‌ని చెప్పుకొచ్చింది. కేవ‌లం నా భ‌ర్త‌కి మాత్ర‌మే లిప్ లాక్ ఇస్తానంటూ పేర్కొంది. అయితే శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మార‌గా, ఆమె ఎప్పుడు లిప్ లాక్ ఇవ్వ‌లేదా అని నెటిజ‌న్స్ సెర్చ్ చేశారు. దీంతో ఆమె లిప్ లాక్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. శ్రీలీల డెబ్యూ మూవీ కిస్ లో హీరో విరాట్‌తో క‌లిసి లిప్ లాక్ సీన్ చేసింది. అంతే కాదు ఆ సినిమాలో బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి షాక్‌కి గురి చేసింది.

అయితే ఇప్పుడు ఆమె లిప్ లాక్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇది చూసిన నెటిజ‌న్స్ భర్తకే లిప్ కిస్ అన్నావు. మరి ఇదేంటని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి దీనిపై శ్రీలీల ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక ఇప్పుడు శ్రీలీల చేతిలో అరడజను చిత్రాల‌కి పైగా ఉన్నాయి. మ‌హేష్ బాబు గుంటూరు కారంలో న‌టిస్తుండ‌గా, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తో జతకడుతుంది. అలాగే విజయ్ దేవరకొండతో ఒక చిత్రం, ఆదికేశవ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జంటగా చేస్తుంది.ఇవే కాక ప‌లు సినిమాలు కూడా ఈ అమ్మ‌డి ఖాతాలో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ స‌ర‌స‌న కూడా న‌టించే అవ‌కాశం ఈ అమ్మ‌డికి దక్కినట్టు టాక్.