Mallojula Venugopal |మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర‌నేత మ‌ల్లోజుల వీడియో రిలీజ్

మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాలు..తన లొంగుబాటుకు దారితీసిన పరిస్థితులు, పార్టీలో తలెత్తిన పరిణామాలు వంటి వాటిపై వివరణాత్మకంగా వివరించారు

Mallojula Venugopal |మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర‌నేత మ‌ల్లోజుల వీడియో రిలీజ్

విధాత : మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత(Maoist Leader) మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) ఓ వీడియో విడుదల(Video Release) చేశారు. ఈ వీడియోలో ఆపరేషన్ కగార్ అనంతర పరిణామాలు..తన లొంగుబాటుకు దారితీసిన పరిస్థితులు, పార్టీలో తలెత్తిన పరిణామాలు వంటి వాటిపై వివరణాత్మకంగా వివరించారు. లొంగిపోయినవారిని విప్ల‌వ ద్రోహులుగా చిత్రీక‌రించొద్దు అని స్పష్టం చేశారు. ప్రజలతో పాటు పార్టీ కేడర్ ప్రాణాలు కాపాడే క్రమంలో అంతిమ ప్రయత్నంగా ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలో కలవాల్సి వచ్చిందన్నారు.

ఏదైన అదనపు సమాచారం కావాలన్న..పార్టీ సభ్యులు లొంగుబాటుకు సంబంధించి గాని సంప్రదించేందుకు నా సెల్ ఫోన్ నంబర్ 8856038533 కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే మరో అగ్రనేత తక్కెళ్ల పల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ ఫోన్ నంబర్ 6267138163 కు కూడా చేయవచ్చన్నారు. అజ్ఙాతంలో ఉన్న మావోయిస్టులు జ‌న‌జీవ‌నంలోకి రావాలన కోరారు. మారిన ప‌రిస్థితులు గ‌మ‌నించి అర్దం చేసుకోవాలని మ‌ల్లోజుల విన్నవించారు.