Telangana | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని(పీఆర్‌సీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ శివశంకర్ చైర్మన్‌గా పీఆర్‌సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బీ రామయ్యను నియమించినట్లు తెలిపారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకూ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని నిర్ణయించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram