గోవాలో వాటిపై ఇక నిషేధం..

గోబీ మంచురియా.. మ‌న ముందు వాలిపోయిందంటే చాలు.. లొట్ట‌లేసుకుంటూ ఆర‌గిస్తాం. కానీ స్పైసీగా ఉండే ఈ గోబీ మంచురియాపై గోవాలో యుద్ధం కొన‌సాగుతోంది.

గోవాలో వాటిపై ఇక నిషేధం..

గోబీ మంచురియా.. ఈ పేరు విన‌గానే ఆహార ప్రియుల‌కు నోరూరిపోతోంది. ఇక ఆ ఫుడ్ మ‌న ముందు వాలిపోయిందంటే చాలు.. లొట్ట‌లేసుకుంటూ ఆర‌గిస్తాం. కానీ స్పైసీగా ఉండే ఈ గోబీ మంచురియాపై గోవాలో యుద్ధం కొన‌సాగుతోంది.

ఎందుకంటే.. గోబీ మంచురియాను అప‌రిశుభ్ర ప‌రిస్థితుల్లో త‌యారు చేస్తున్నార‌ని, ప్రాణాల‌కు హానీ క‌లిగించే సింథ‌టిక్ క‌ల‌ర్స్‌ను వినియోగిస్తుండ‌టంతో, అది ప్రాణాల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని ఆందోళ‌న క‌లుగుతోంది. దీంతో గోవాలోని మ‌పుసా మున్సిప‌ల్ కౌన్సిల్ నిషేధం విధించింది. ఈ క్ర‌మంలో ప్రసిద్ధ బోడ్గేశ్వ‌ర ఆల‌యం జాత‌ర వ‌ద్ద గోబీ మంచురియాను నిషేధించాల‌ని కౌన్సిల్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై గ‌త నెల‌లో మున్సిప‌ల్ కౌన్సిల్ ఏక‌గ్రీవ తీర్మానం చేయ‌గా, స‌భ్యులంద‌రూ ఆమోద ముద్ర వేశారు. దీంతో గోబీ నిషేధం గోవాలోని మపుసా మున్పిస‌ల్ కౌన్సిల్‌లో అమ‌ల్లోకి వ‌చ్చింది.

అయితే గోవాలో గోబీ మంచురియాపై నిషేధం విధించ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ గోబీ మంచురియాపై నిషేధం విధించారు. 2022లో శ్రీ దామోద‌ర్ ఆల‌యంలోని వాస్కో సప‌థ్ ఫెయిర్‌లోనూ గోబీ మంచురియాపై నిషేధం విధించారు. మొత్తానికి గోబీ మంచురియాపై గోవాలో నిషేధం కొన‌సాగ‌డంపై ఆహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.