పబ్లిక్‌లో 26 ఏళ్ల క్రితం సాంగ్‌కి లారెన్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వెంకటేష్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పటికీ ఎంత జోష్‌తో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలలోనే కాదు బయట కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన తోటివారిని ఉత్సాహపరుస్తుంటారు. క్రికెట్ స్టేడియంలో సందడి చేస్తూ అలరిస్తూ ఉండే వెంకీ అప్పుడప్పుడు మూవీ ఈవెంట్స్‌కి హాజరవుతుంటారు. ఆ సమయంలో వెంకటేష్ స్పీచ్ కాని, ఆయన డ్యాన్స్ మూమెంట్స్ కాని ఆడియన్స్‌కి మంచి కిక్ ఇస్తుంటాయి. తాజాగా ఆయన ‘జిగర్తాండ డబల్ ఎక్స్’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ , SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా జిగర్తాండ డబల్ ఎక్స్ రూపొందింది.
ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని ‘పెళ్లి కల వచ్చేసింది బాల..’ అంటూ సాగే పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులు వేసారు. పాట ప్లే కాగానే ముందుగా లారెన్స్ స్టెప్పులు వేయగా, వెంకటేష్‌ని కూడా చేయమని సుమ కోరడంతో వెంకీ కూడా అదరగొట్టే స్టెప్పులు వేసి అలరించాడు. వెంకీ మామ వేసిన సిగ్నేచర్ స్టెప్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
26 ఏళ్ళ క్రితం వచ్చిన వెంకటేష్ సినిమా ప్రేమించుకుందాం రా లోని పెళ్లికళ వచ్చేసింది బాల.. సిగ్నేచర్ స్టెప్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది ఫంక్షన్స్‌లో ఈ స్టెప్స్ ఎక్కువగా వేసేవారు. 26 ఏళ్ల తర్వాత వెంకీ మళ్లీ ఆ స్టెప్ వేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వెంకీ అభిమానులు అయితే ఈ వీడియో చూసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరో వెంకటేష్ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆయన రెండో కూతురు నిశ్చితార్థ వేడుక కొద్ది రోజుల క్రితం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలంతా తరలివచ్చారు. చిరంజీవి, మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.