ఆదివారం సూర్య భగవానుడిని పూజిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలట..!
అన్నింటికి ప్రాణదాత అయిన సూర్యుడిని ఆదివారం పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారమే ఉత్తమమైన రోజు అని పేర్కొంటున్నారు.

సూర్య భగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత. సూర్య కిరణాల వల్లనే ఈ భూమ్మీద ఉన్న జీవరాశులు మనుగడ కొనసాగిస్తున్నాయి. సూర్యుడు లేకపోతే ఏ జీవి కూడా భూమ్మీద బతకలేదు. అన్నింటికి ప్రాణదాత అయిన సూర్యుడిని ఆదివారం పూజిస్తే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారమే ఉత్తమమైన రోజు అని పేర్కొంటున్నారు.
ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా మంచిది..
సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత అర్ఘ్యం సమర్పించి, సూర్యుని స్తోత్రం లేదా సహస్రనామాన్ని భక్తితో పఠించాలి. ఇక ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుందట. ఆదివారం ఉపవాసం ఉంటే ఇంకా మంచిదట. నూనె, ఉప్పు అసలు తినకూడదు. ఆదివారాల్లో గోధుమలు, రాగి, నెయ్యి, బంగారం, బెల్లం దానం చేయడం వల్ల సూర్యునికి సంబంధించిన అశుభాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పారు.
నేత్ర వ్యాధులు రాకుండా ఉండాలంటే..
మీకు సూర్యుడు అశుభ ఫలితాలు ఇస్తున్నట్లు మీ జాతకంలో ఉంటే.. శుభ ఫలితాల కోసం మీ మెడలో రాగి నాణేన్ని ధరించాలి. ఎరుపు దారంతో మాత్రమే ఆ నాణేన్ని వేసుకోవాలి. మీ కళ్ళు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటికి సంబంధించిన వ్యాధులు త్వరగా తగ్గాలన్నా ప్రతిరోజూ సూర్యుడిని ప్రార్థించాలి. నేత్రవ్యాధులు రాకుండా రక్షించుకోవాలంటే రోజూ భక్తిశ్రద్ధలతో నేతోపనిషత్తు పారాయణం చేయాలి.