విధాత: పార్టీ ఫిరాయించిన(Defection) 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAS) అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు(Supreme Court Verdictm)వెలువరించింది. ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో(THRSS MONTHS) నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్జిస్ బీఆర్.గవాయ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశంగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జస్టిస్ గవాయ్ బెంచ్ సుదీర్ఘ వాదనలను విన్న తర్వాతా ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. గురువారం తుది తీర్పు వెలువరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత(Disqualification)పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్ ను ఆదేశించింది. ఏండ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్ లో ఉంచడం సరికాదని స్పష్టం చేసింది. అలాగే పార్లమెంటు కూడా ఫిరాయింపు చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ల వినతిని కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆక్టోబర్ 31లో ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.
2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించింది.
సుప్రీం తీర్పుతో అనర్హత తేలడంపై సందేహాలు
తెలంగాణ లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పై 3 నెలల లోపు శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత అంశం తేలిపోతుందా అంటే న్యాయనిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మూడు నెలల లోపు స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుపై ఎమ్మెల్యే లు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం తీర్పు వెలువడితే..హైకోర్టు తీర్పుపై మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది.. తర్వాత రాజ్యంగ ధర్మాసనంలో అప్పీల్ కు వెళ్తారు..ఆ తర్వాత తుది తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేమని న్యాయ నిపుణులు ఈ కేసులో మరో కోణంలోని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ లెక్కన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తేలేవరకు వారి ఎమ్మెల్యేల పదవి కాలం ఐదేళ్లు ముగిసిపోనుంది. అందుకే ఈ అంశంలో నిర్థిష్టమైన సమయంలో నిర్ణయం వెలువడాలంటే..పార్లమెంటులో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో మార్పులు అనివార్యమన్న వాదన వ్యక్తమవుతుంది.