Air India | లగేజీ పాలసీని మార్చేసిన ఎయిర్‌ ఇండియా.. ఉచితంగా ఎన్ని కిలోలు తీసుకువెళ్లచ్చో తెలుసా..?

Air India | టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కంపెనీ లగేజీ పాలసీని మార్చివేసింది. దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎకానమీ క్లాస్‌లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణికులు ఉచితంగా కేవలం 15 కేజీలు మాత్రమే లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉన్నది.

Air India | లగేజీ పాలసీని మార్చేసిన ఎయిర్‌ ఇండియా.. ఉచితంగా ఎన్ని కిలోలు తీసుకువెళ్లచ్చో తెలుసా..?

Air India | టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కంపెనీ లగేజీ పాలసీని మార్చివేసింది. దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎకానమీ క్లాస్‌లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణికులు ఉచితంగా కేవలం 15 కేజీలు మాత్రమే లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉన్నది. గతంలో రెండు కేటగిరిల్లో 20 కేజీల వరకు తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఎయిర్‌ ఇండియా ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో ఉచిత లగేజీ పరిమితి 25 కిలోలుగా ఉండేది. ఎయిర్‌ ఇండియాను టాటాగ్రూప్‌ టేకోవర్‌ చేసిన అనంతరం 20 కేజీలకు కుదించింది.

తాజాగా మార్చిన లగేజీ పాలసీలో మరో ఐదు కిలోలు తగ్గించింది. ఇకపై 15 కిలోలు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధన మే 2 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. అయితే ఎకానమీ క్లాస్‌లో ఫ్లెక్స్ కేటగిరీలో ప్రయాణించేవారికి మాత్రం 25 కేజీల వరకు ఉచితంగా లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం.. ఏ ఎయిర్ లైన్స్ సంస్థ అయినా కనీసం 15 కేజీల లగేజీని ఉచితంగా అనుమతించాల్సిందే. ఇతర విమానయాన సంస్థలు సైతం 15 కేజీలను మాత్రమే సింగిల్‌ బ్యాగేజీ రూపంలో అనుమతిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌ ఇండియా సైతం ఆయా కంపెనీల బాటలోనే నడుస్తూ లగేజీని ఐదు కిలోలు కుదించింది.