Amazon Sale | త్వరలో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు..!
Amazon Sale | ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ప్రొడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతేగాక సెలక్టెడ్ డివైజ్‌లపై భారీ తగ్గింపులు అందించనుంది. అదేవిధంగా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, AC లు ఇతర పరికరాలపై కస్టమర్‌లు గొప్ప డీల్‌లను పొందవచ్చు.
Amazon Sale : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ప్రొడక్ట్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతేగాక సెలక్టెడ్ డివైజ్‌లపై భారీ తగ్గింపులు అందించనుంది. అదేవిధంగా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, AC లు ఇతర పరికరాలపై కస్టమర్‌లు గొప్ప డీల్‌లను పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం అమెజాన్‌లో సమ్మర్ సేల్ బ్యానర్ లైవ్ అవుతున్నది. సేల్ డేట్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ సేల్‌లో కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, AC లు, రిఫ్రిజిరేటర్‌లు, కూలర్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటి అనేక ప్రత్యేక పరికరాలపై డిస్కౌంట్లు, ఆఫర్లను పొందవచ్చు. ఏ పరికరాలపై ఎంత వరకు డిస్కౌంట్ లభించనుందో చూద్దాం..
డిస్కౌంట్స్..
- బెస్ట్ డీల్ – రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్
- స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా 40 శాతం తగ్గింపు
- ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు
- హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపు
- ఏసీలపై 55 శాతం వరకు తగ్గింపు
- రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు తగ్గింపు
- స్మార్ట్‌వాచ్‌లపై 70 శాతం వరకు తగ్గింపు
- ట్యాబ్లెట్‌లపై 70 శాతం వరకు తగ్గింపు
- టాప్ రేటింగ్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు
- ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు
- Alexa, Fire TV పరికరాలపై గరిష్టంగా 45 శాతం తగ్గింపు
పైవే కాకుండా అమెజాన్ కూపన్‌లు, క్యాష్‌బ్యాక్ రివార్డ్స్, ప్రీ-బుక్, బై మోర్ సేవ్ మోర్, అమెజాన్ కాంబో ద్వారా మరింత మెరుగైన ఆఫర్‌లను అమెజాన్ ఇండియా తీసుకువస్తోంది. అమెజాన్ ఈ సేల్‌లో పాకెట్-ఫ్రెండ్లీ స్టోర్‌లను కూడా హోస్ట్ చేస్తుంది. ఇందులో రూ.99 లోపు స్టోర్‌లు, రూ.199 లోపు స్టోర్‌లు, రూ.299 లోపు స్టోర్‌లు, రూ.499 లోపు స్టోర్‌లు ఉంటాయి. అదేవిధంగా 8pm డీల్ స్టోర్, గ్రాండ్ ఓపెనింగ్ డీల్ మొదలైన డీల్ స్టోర్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ICICI బ్యాంక్, BoB, OneCard క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram