Apple Event | ఐఫోన్‌ 16 లాంచింగ్‌ ఈవెంట్‌ డేట్‌ని ప్రకటించిన ఆపిల్‌..! కొత్త సిరీస్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Apple Event | ప్రముఖ టెక్‌ దిగ్గజం త్వరలో ఆపిల్‌ ఐఫోన్స్‌తో పాటు పలు ఉత్పత్తులను విడుదల చేయనున్నది. దీనికి ముందు ప్రత్యేకంగా లాంచింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నది. సెప్టెంబర్‌ 9న ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Apple Event | ఐఫోన్‌ 16 లాంచింగ్‌ ఈవెంట్‌ డేట్‌ని ప్రకటించిన ఆపిల్‌..! కొత్త సిరీస్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Apple Event | ప్రముఖ టెక్‌ దిగ్గజం త్వరలో ఆపిల్‌ ఐఫోన్స్‌తో పాటు పలు ఉత్పత్తులను విడుదల చేయనున్నది. దీనికి ముందు ప్రత్యేకంగా లాంచింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నది. సెప్టెంబర్‌ 9న ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మీడియా కంపెనీ ఆహ్వానాలు పంపింది. ఇందులో ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్‌ చేయబోతున్నది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు విడుదల కానున్నాయి. ఆపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్‌లను సైతం లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఆపిల్‌ ఈవెంట్‌కు ట్యాగ్‌లైన్‌ ‘ఇట్స్‌ గ్లోటైమ్‌’గా పేరు పెట్టింది. ఇంతకు ముందు ఆపిల్‌ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 10నే జరుగనున్నట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి. అయితే, సెప్టెంబర్‌ 9న రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్‌ మొదలుకానున్నది. ఆపిల్ యూట్యూబ్‌ చానెల్‌, వెబ్‌సైట్‌ ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.

ఈ ఈవెంట్‌లో iOS 18 అప్‌డేట్ తేదీని సైతం ప్రకటించే అవకాశం ఉన్నది. ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ లాంచ్ అవనున్నాయి. ఈ కొత్త మోడల్స్‌లో యాక్షన్ బటన్ ఉంటుందని తెలుస్తున్నది. ఐఫోన్ 16 సాధారణ మోడల్ ధర 799 డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.67,100 ఉంటుంది. 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర 899 డాలర్లు అంటే.. దాదాపు రూ.75,500గా తెలుస్తున్నది. ఐఫోన్‌ ప్రో ధర 1,099 డాలర్లు అంటే దాదాపు రూ.92,300 ఉండే అవకాశం ఉన్నది. ప్రో మ్యాక్స్‌ ధర 1199 డాలర్లు.. భారతీయ కరెన్సీలో రూ.1,00,700 ఉండవచ్చని అంచనా. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ మోడల్స్‌లో ఏ18 చిప్‌సెట్‌, 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సపోర్ట్‌ సైతం ఉంటుంది. సాధారణ మోడల్‌ 60హెర్ట్‌జ్‌ ర్రిఫెష్‌ రేట్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో 40 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 20 వాట్స్‌ మగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది.