Bank Holidays | బీ అలర్ట్.. మార్చి నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు..!
Bank Holidays | నిన్నటితో ఫిబ్రవరి నెల ముగిసింది. నేటి మార్చి నెల ప్రారంభమైంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఈ నెల చాలా కీలకం. ఎందుకంటే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది.

Bank Holidays | హైదరాబాద్ : నిన్నటితో ఫిబ్రవరి నెల ముగిసింది. నేటి మార్చి నెల ప్రారంభమైంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఈ నెల చాలా కీలకం. ఎందుకంటే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కాబట్టి బ్యాంకర్లు బిజీగా ఉండనున్నారు. ఖాతాదారులు కూడా తమ ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేసుకుంటుంటారు. అయితే ఈ నెలలో 8 రోజులు సెలవులు రానుండడంతో.. ఖాతాదారులు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
సండేలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకొని మొత్తం 8 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ నెలలోనే హోలీ, రంజాన్, ఉగాది పండుగలు కూడా రానున్నాయి. వీటీతో పాటు మార్చి 17 నుంచి బడి పిల్లలకు ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాబట్టి పౌరులు వారికి అనుకూలమైన రోజున అనువైన సమయాల్లో బ్యాంకు వ్యవహారాలు చూసుకోని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.
బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..?
మార్చి 2 – ఆదివారం
మార్చి 8 – రెండో శనివారం
మార్చి 14 – హోలీ
మార్చి 16 – ఆదివారం
మార్చి 22 – నాలుగో శనివారం
మార్చి 23 – ఆదివారం
మార్చి 30 – ఉగాది
మార్చి 31 – రంజాన్