Bank Holidays | దీపావళి, కార్తీక పౌర్ణమి, ఛట్‌ పండుగలు.. నవంబర్‌లో బ్యాంకులు 13 రోజుల బంద్‌..!

Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగియనున్నది. అక్టోబర్‌ (October) మాసం ముగిసి నవంబర్‌ (November) నెల ప్రారంభం కాబోతున్నది. నవంబర్‌ మాసంలో దాదాపు 13 రోజుల పాటు బ్యాంకులు (Banks) మూసే (Closed) ఉండనున్నాయి.

Bank Holidays | దీపావళి, కార్తీక పౌర్ణమి, ఛట్‌ పండుగలు.. నవంబర్‌లో బ్యాంకులు 13 రోజుల బంద్‌..!

Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగియనున్నది. అక్టోబర్‌ (October) మాసం ముగిసి నవంబర్‌ (November) నెల ప్రారంభం కాబోతున్నది. నవంబర్‌ మాసంలో దాదాపు 13 రోజుల పాటు బ్యాంకులు (Banks) మూసే (Closed) ఉండనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం విధితమే. తాజాగా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank Of India) విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకొని వెళ్తే ఇబ్బందులు ఉండవు. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకు, యూపీఐ సర్వీసులు 24/7 కొనసాగనున్నాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు, డిపాజిట్‌ కోసం మెషిన్స్‌ సైతం మెషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే, కొన్ని అవసరాల కోసం మాత్రమే బ్యాంకులకు వెళ్లక తప్పదు. సెలువుల సమాచారం ఉంటే ముందస్తుగానే పూర్తి చేసుకునేందుకు వీలుంటుంది. ఇక నవంబర్‌లో దీపావళి, కుట్‌ ఫెస్టివల్‌, బలి పాడ్యమి, ఛత్‌ పూజ, గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి నేపథ్యంలో బ్యాంకులు మూసివేయనున్నారు.

సెలవుల జాబితా ఇదే..

నవంబర్‌ 1 : దీపావళి, కుత్‌ మహోత్సవం, కన్నడ రాజ్యోత్సవం నేపథ్యంలో త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 2 : గోవర్ధన్‌ పూజ, లక్ష్మీపూజ, విక్రమ్‌ సంవత్‌, బలిపాడ్యమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులకు హాలీడే.
నవంబర్ 3 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
నవంబర్ 7 : ఛట్‌ పూజ సందర్భంగా బెంగాల్‌, బిహార్‌, జార్ఖండ్‌లో బ్యాంకులకు హాలీడే.
నవంబర్‌ 8 : ఛట్‌పూజ సందర్భంగా బిహార్‌, జార్ఖండ్‌, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఛట్‌, వంగ్లా పండుగల నేపథ్యంలో సెలవు.
నవంబర్ 9 : రెండోశనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 10 : ఆదివారం నేపథ్యంలో బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేత.
నవంబర్‌ 12 : ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌, హైదరాబాద్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, నాగాలాండ్‌, బెంగాల్‌, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌లో బ్యాంకుల మూసివేత.
నవంబర్‌ 15 : కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి సందర్భంగా మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.
నవంబర్‌ 17 : ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.
నవంబర్‌ 18 : కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు సెలవు.
నవంబర్ 23 : నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
నవంబర్ 24 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.