2026 Bank Holidays | 2026లో బ్యాంకుల సెల‌వుల జాబితా.. తెలంగాణ‌లో బంద్ ఎప్పుడంటే..?

2026 Bank Holidays | మీరు నిత్యం బ్యాంక్‌( Bank )కు వెళ్తుంటారా..? వారంలో క‌నీసం రెండు రోజులైనా బ్యాంకులో లావాదేవీలు జ‌రుపుతారా..? అయితే మీలాంటి వారి కోస‌మే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( reserve Bank of India ) 2026 ఏడాదికి సంబంధించి సెల‌వుల జాబితా( bank Holidays )ను ప్ర‌క‌టించింది. ఆ వివ‌రాలు మీ కోసం..

  • By: raj |    business |    Published on : Dec 29, 2025 8:36 PM IST
2026 Bank Holidays | 2026లో బ్యాంకుల సెల‌వుల జాబితా.. తెలంగాణ‌లో బంద్ ఎప్పుడంటే..?

2026 Bank Holidays | హైద‌రాబాద్ : మ‌రో రెండు రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం రానుంది. అంటే 2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగు పెట్ట‌బోతున్నాం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సంబంధించిన సెల‌వుల జాబితా విడుద‌లైంది. ఇక మిగిలింది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( reserve Bank of India ) క్యాలెండ‌రే. ఆ ఆర్బీఐ క్యాలెండ‌ర్( RBI Calendar ) కూడా విడుద‌లైంది. దీంతో ఖాతాదారులు( Customers ) అల‌ర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఏయే రోజుల్లో బ్యాంకులు మూత‌ప‌డుతాయో( Bank Holidays ) తెలుసుకోంటే.. లావాదేవీల‌కు సంబంధించిన కార్య‌కలాపాలు ముందే చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి తెలంగాణ‌, ఏపీలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూత ప‌డనున్నాయో తెలుసుకుందాం.

2026లో బ్యాంకుల‌కు సెల‌వులు ఇవే..

జ‌న‌వ‌రిలో

15 – సంక్రాంతి
26 – రిప‌బ్లిక్ డే

మార్చి

3 – హోలీ
19 – ఉగాది
20 – రంజాన్
27 – శ్రీరామ‌న‌వ‌మి

ఏప్రిల్

1 – ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంంభం
3 – గుడ్ ఫ్రైడే
14 – అంబేద్క‌ర్ జ‌యంతి

మే

1 – మే డే
27 – బ‌క్రీద్

జూన్

26 – మొహ‌ర్రం

ఆగ‌స్టు

15- స్వాతంత్య్ర దినోత్స‌వం
26 – మిలాద్ ఉన్ న‌బీ

సెప్టెంబ‌ర్

4 – శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి
14 – వినాయ‌క చ‌వితి

అక్టోబ‌ర్

2 – గాంధీ జ‌యంతి
20 – ద‌స‌రా

న‌వంబ‌ర్

8 – దీపావ‌ళి
24 – గురునాన‌క్ జ‌యంతి

డిసెంబ‌ర్

25 – క్రిస్మ‌స్