EVs More Cost | 6 నెలల్లో ఇంధన వాహనాలతో సమానంగా ఈవీ ధరలు
రాబోయే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానం అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. క్రూడాయిల్ దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

EVs More Cost | ఇప్పటి వరకు తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఆరు నెలల తరువాత భారం కానున్నాయి. వచ్చే ఆరు నెలల వ్యవధిలో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఈవీ ల ధరలు ఉంటాయని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విదేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతి ప్రతి సంవత్సరం రూ.22 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, ఫలితంగా పర్యావరణం దెబ్బతింటున్నదని అన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో 20వ ఫిక్కీ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ – 2025 లో గడ్కరీ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ లో ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నేను రవాణ మంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉత్పత్తులు 14 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. యూఎస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉత్పత్తులు రూ.78 లక్షల కోట్లు, చైనా రూ.47 లక్షల కోట్లు అన్నారు. రూ.45వేల కోట్ల విలువైన మొక్కజొన్నలను ఎథనాల్ పరిశ్రమలకు రైతులు విక్రయించారన్నారు.