Nita Ambani | కన్యాదానంపై నీతా అంబానీ భావోద్వేగ వ్యాఖ్యలు.. కంటతడి పెట్టిన అతిథులు..!

Nita Ambani | రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కన్యాదానంపై హృదయాలను కదిలించే వ్యాఖ్యలు చేశారు. తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం సందర్భంగా నీతా కన్యాదానం ప్రాశస్త్యాన్ని వివరించారు. 'అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు' అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు.

Nita Ambani | కన్యాదానంపై నీతా అంబానీ భావోద్వేగ వ్యాఖ్యలు.. కంటతడి పెట్టిన అతిథులు..!

Nita Ambani : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కన్యాదానంపై హృదయాలను కదిలించే వ్యాఖ్యలు చేశారు. తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం సందర్భంగా నీతా కన్యాదానం ప్రాశస్త్యాన్ని వివరించారు. ‘అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు’ అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు.

ఆమె మాటలకు అంబానీ కుటుంబసభ్యులతోపాటు అతిథుల కళ్లు చమర్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు..? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె ఒక ఆస్తి కాదు మరొకరికి బదిలీ చేయడానికి. ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం, వెలుగుకు మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడామె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుంది’ అని నీతా అంబానీ చెప్పారు.

‘మన సంస్కృతీ సంప్రదాయాలు స్త్రీలకు అత్యంత గౌరవం ఇచ్చాయి. ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని మన పవిత్ర గ్రంథాలు నేర్పించాయి. కుమార్తెలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ. అమ్మాయిలు మన ఇళ్లను స్వర్గంగా మారుస్తారు. వివాహ బంధం అనేది వధూవరుల మధ్య, వారి కుటుంబాల మధ్య సంపూర్ణ సమానత్వమనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కన్యాదానానికి నిజమైన అర్థం ఏమిటంటే వధువు తల్లిదండ్రులు వరుడిని తమ కుమారుడిగా అంగీకరించడం. అమూల్యమైన తన కుమార్తెను అతడి కుమారుడి చేతుల్లో పెట్టడం. నేను కూడా ఓ కుమార్తెనే. ఒక అమ్మాయికి తల్లిని, అత్తను కూడా. ఆడపిల్లలు లక్ష్మీ స్వరూపులు. వారు పుట్టగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కుటుంబాలు సంతోషమనే వెలుగులతో విరాజిల్లుతాయి’ అని వివరించారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

నీతా అంబానీ గద్గద స్వరంతో ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె భర్త ముకేశ్‌ అంబానీ, కుమార్తె ఈశా అంబానీ సహా అతిథుల్లో చాలామంది భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. నీతా అంబానీని చప్పట్లతో అభినందించారు.