New EV’s | త్వరలో మార్కెట్‌లోకి ఐదు ఎలక్ట్రిక్ కార్లు.. ఒక్కోటీ ఒక్కో స్పెషాలిటీతో!
దేశంలో వివిధ కంపెనీలు వరుసగా తమ ఈవీ కార్లను మార్కెట్‌లోకి వదులుతున్నాయి. త్వరలో ప్రవేశించినున్న ఈవీలతో ఇప్పటికే పాపులర్ అయిన మిడ్ సైజ్, కాంపాక్ట్ ఎస్‌యూవీల సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

New EV’s | పెట్రోల్ ఖర్చుల భారం, సిటీల్లో ట్రాఫిక్ కారణంగా మైలేజీ ఆశించిన లేకపోవడంతో చాలా మంది ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను, కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో వివిధ కంపెనీలు వరుసగా తమ ఈవీ కార్లను మార్కెట్‌లోకి వదులుతున్నాయి. త్వరలో ప్రవేశించినున్న ఈవీలతో ఇప్పటికే పాపులర్ అయిన మిడ్ సైజ్, కాంపాక్ట్ ఎస్‌యూవీల సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. భారతదేశ కంపెనీలతోపాటు పలు విదేశీ కంపెనీలు సైతం అన్ని సెగ్మెంట్‌లలోకి ఈవీలను ప్రవేశపెట్టే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి. ఈ దిశగా రాబోతున్న ఐదు కొత్త ఈవీలు ఇవే..
మారుతి సుజుకి ఈ విటారా
మారుతి ప్రొడక్ట్స్‌లో విటారా భారీగా పాపులర్ అయింది. ఇప్పుడు దీనిని ఈవీ వెర్షన్‌లో తీసుకురానున్నారు. దీనికి ‘ఈ విటారా’ అని నామకరణం కూడా చేశారు. ‘ఈ విటారా’ రెండు బ్యాటరీల ప్యాక్ ఆప్షన్‌తో రానున్నది. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వీటి ధరలు, ఇతర విషయాలు వెల్లడికావాల్సి ఉన్నది.
టాటా హారియర్ ఈవీ
టాటా కంపెనీ ఇప్పటికే పంచ్, నెక్సాన్ వంటి మోడళ్లతో ఈవీ రంగంలో సక్సెస్ అయింది. టాటా హారియర్ సైతం నాన్ ఈవీ రంగంలో సత్తా చాటుతున్నది. ఇప్పుడు హారియర్‌కు ఈవీ వెర్షన్‌ను లాంచ్ చేయబోతున్నారు. మొన్నామధ్య భారత్ మొబిలిట గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా హారియర్ ఈవీ దర్శనమిచ్చింది. 75కే డబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది కూడా సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సమాచారం.
మహీంద్ర ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ
మహీంద్రలో ఎక్స్‌యూవీలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే త్వరలోనే భారతీయ రోడ్లపైకి మహీంద్ర ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ పరుగులు తీయనున్నది. ఈ విటారా తరహాలోనే మహీంద్ర ఈవీ కూడా రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్‌తో రానున్నది.
ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎల్‌ఆర్
సింగిల్ చార్జింగ్‌తో 460 కిలోమీటర్లు ప్రయాణించేలా లాంగ్ రేంజ్ విండ్సర్ ఈవీ రానున్నది.
కియా ఈవీ 6 ఫేస్‌లిఫ్ట్
కియా ఈవీ 6 కొత్త రూపంతో ఈ ఏడాది దర్శనమివ్వనున్నది. అప్‌డేటెడ్ వెర్షన్‌లో 84 కేడబ్ల్యూహెచ్ భారీ బ్యాటరీ ప్యాక్, ఎక్సటెండెడ్ డ్రైవింగ్ రేంజ్‌తో రానున్నది.