ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోకి ఆపిల్‌ ఎంట్రీ..! తొలి ఈవీ రిలీజ్‌ అప్పుడే

ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల కంపెనీ ఆపిల్‌.. ఎలక్ట్రికల్‌ వాహనాల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలోకి ఆపిల్‌ ఎంట్రీ..! తొలి ఈవీ రిలీజ్‌ అప్పుడే

Apple EV Vehicle | ప్రముఖ ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల కంపెనీ ఆపిల్‌.. ఎలక్ట్రికల్‌ వాహనాల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీ అయిన ఆపిల్‌ సైతం ఈవీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లుగా పలు నివేదిక పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్‌ టైటాన్‌’ పేరుతో ఆపిల్‌ ఈవీతో ఎలక్ట్రికల్‌కార్ల తయారీరంగంలో అడుగుపెట్టబోతున్నది.


అయితే, ఆపిల్‌ టైటాన్‌ తొలి ఈవీ కారు 2028లో మార్కెట్‌లోకి విడుదవుతుందని నివేదిక వెల్లడించింది. 2015లో ప్రాజెక్టు ప్రారంభమైందని.. పలు అవాంతరాలు, కార్యనిర్వాహక టర్నోవర్‌ సమస్యలను దాటుకొని ముందుకెళ్తున్నది. అయితే, కంపెనీ సీరింగ్‌ వీల్‌ లేని ఆటోమేటిక్‌ వాహనాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆపిల్‌ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లించ్ 2021 నుంచి ప్రాజెక్ట్ టైటాన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనం కోసం పలు సర్దుబాట్లు చేసింది.


డ్రైవర్ ప్రమేయం లేకుండా పూర్తిగా ఆటోమెటిక్‌ కారును తీసుకువచ్చేలా ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కంపెనీ తగ్గించుకున్నది. ఆపిల్ కారు ఇతర ఈవీలతో.. ముఖ్యంగా టెస్లాలో మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆపిల్ సవరించిన ప్రణాళిక.. కారును లెవెల్-2 ప్లస్‌ సిస్టమ్‌గా ఉంచగా.. టెస్లాకు ఆటోపైలట్ సిస్టమ్‌ను పోలి ఉండనున్నట్లు నివేదిక చెప్పింది.


అయితే, ప్రాజెక్ట్ టైటాన్ అమలు కోసం ప్రణాళికను అందించడానికి, ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేయడాన్ని పరిగణించాలని కంపెనీ బోర్డు గత సంవత్సరం సీఈఓ టిమ్ కుక్‌పై ఒత్తిడి తెచ్చిందని నివేదిక చెప్పింది. తాజా పరిణామాలు, వివరాలపై ఆపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. వేగంగా మారుతూ వస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యాపిల్ ఈవీలో కొత్త ఫీచర్లను జోడించేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదిక వివరించింది.