Google Pay | గూగుల్‌ పే వాడే వారికి శుభవార్త.. ఆ సర్వీసులు ఉచితమే..!

Google Pay | దేశంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూపీఐ సేవలు అందిస్తున్నాయి. ఆయా కంపెనీలు కష్టమర్లను ఆకట్టుకునేందుకు క్యాష్‌బ్యాక్‌, రివార్డులు, వోచర్లు ఇస్తున్నాయి. తాజాగా గూగుల్‌ పే ఉచితంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇతర యాప్స్‌తో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. యూజర్ల కోసం సిబిల్‌ స్కోర్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నది. క్రెడిట్‌ కార్డ్‌, పర్సనల్‌ లోన్‌ తీసుకునేందుకు సిబిల్‌ స్కోర్‌ చాలా ముఖ్యమైంది. చాలా సంస్థలు సిబిల్‌ […]

Google Pay | గూగుల్‌ పే వాడే వారికి శుభవార్త.. ఆ సర్వీసులు ఉచితమే..!

Google Pay |

దేశంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూపీఐ సేవలు అందిస్తున్నాయి. ఆయా కంపెనీలు కష్టమర్లను ఆకట్టుకునేందుకు క్యాష్‌బ్యాక్‌, రివార్డులు, వోచర్లు ఇస్తున్నాయి. తాజాగా గూగుల్‌ పే ఉచితంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇతర యాప్స్‌తో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. యూజర్ల కోసం సిబిల్‌ స్కోర్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నది. క్రెడిట్‌ కార్డ్‌, పర్సనల్‌ లోన్‌ తీసుకునేందుకు సిబిల్‌ స్కోర్‌ చాలా ముఖ్యమైంది. చాలా సంస్థలు సిబిల్‌ స్కోర్‌ సర్వీసులకు ఫీజులు వసూలు చేస్తుంటాయి.

అయితే, గూగుల్‌ పే యూజర్ల కోసం ఉచిత సేవలు అందిస్తున్నది. సిబిల్ స్కోర్ అంటే.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అర్థం. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధీకృత క్రెడిట్ ఏజెన్సీ. వ్యక్తుల రుణాలు, చెల్లింపులు, క్రెడిట్ కార్డుల వ్యవహారాన్ని సేకరించి సంబంధిత వ్యక్తుల లావాదేవీలను బట్టి రిపోర్ట్‌ను ఇస్తూ వస్తుంది.

బ్యాంకులు, వివిధ ఫైనాన్స్‌ సంస్థల రుణాలు, తిరిగి చెల్లించే పద్ధతిని బట్టి హిస్టరీ, స్కోర్ నిర్ణయిస్తూ వస్తుంటుంది. ఓ వ్యక్తి తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నాడా..? ఎన్ని రుణాలున్నాయి ? ఎన్ని క్రెడిట్‌ కార్డులున్నాయి..? అనే వివరాలు అన్నీ ఉంటాయి.

సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉంటుంది. అయితే, 600 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు రుణాలు, క్రెడిట్‌కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. 750 దాటితే మంచి స్కోర్‌గా పరిగణిస్తూ వస్తుంటారు. ఆయా వ్యక్తులకు వారి ఆదాయాన్ని బట్టి రుణం, క్రెడిట్‌కార్డులు జారీ చేస్తుంటాయి.

సిబిల్ స్కోర్ అనేది ఇటీవలి కాలంలో కీలకంగా మారింది. సిబిల్ స్కోర్‌ను బట్టే బ్యాంకులు రుణం మంజూరవుతుందా..? లేదా? తెలిసిపోతుంది. కోట్లాది వినియోగదారులున్న డిజిటల్ పేమెంట్ యాప్‌ అయిన గూగుల్‌పే.. మార్కెట్‌లో పోటీని తట్టుకొని మరింత ముందుకు వెళ్లేందుకు ఫ్రీగా సిబిల్‌ స్కోర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది.