తగ్గిన బంగారం, వెండి ధరలు

మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,070 తగ్గి రూ. 1,45,910వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,900తగ్గి రూ. 1,33,750కి పడిపోయింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గి రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం.. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, డాలర్ బలపడటం వంటి పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,070 తగ్గి రూ. 1,45,910వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,900తగ్గి రూ. 1,33,750కి పడిపోయింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గి రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు గణనీయంగా దిగివచ్చాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తగ్గుదల సానుకూలంగా మారింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ కదలికలు బంగారం ధరల దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరి, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, గోల్డ్‌మన్ సాచ్స్ తన బంగారం ధర అంచనాలను గణనీయంగా తగ్గించింది. గతంలో ఔన్సుకు $5,400గా ఉన్న తన సంవత్సరాంతపు అంచనాను $4,900కు సవరించింది. అంటే మునుముందు బంగారం ధరలు తగ్గడం లేదా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతాయని అంచనా వేసింది.

 

Latest News