Gold Rates | పసిడి కొనుగోలుదారులకు బిగ్‌ రిలీఫ్‌..! నేడు ధరలు ఎలా ఉన్నాయో లుక్కేయండి..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం మార్కెట్‌లో నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,580 పలుకుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Aug 05, 2024, 10:52 am IST
Read Time: 3 mins
Gold Rates | పసిడి కొనుగోలుదారులకు బిగ్‌ రిలీఫ్‌..! నేడు ధరలు ఎలా ఉన్నాయో లుక్కేయండి..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం మార్కెట్‌లో నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,580 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,5800 పలుకుతున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.64,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,730 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,580 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.70,580కి చేరింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర భారీగా పెరిగింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.200 చొప్పున పెరిగి కిలో ధర రూ.రూ.85,700 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.91వేలకు పెరిగింది. అయితే, బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.