Gold Silver Rate Today | మళ్లీ తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800తగ్గి రూ. 1,49,130వద్ద కొనసాగుతుంది, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,650 తగ్గి రూ. 1,36,700వద్ద నిలిచింది. వెండి ధర మాత్రం రూ.2,55,000వద్ద స్థిరంగా ఉంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 06, 2026, 12:11 pm IST
Read Time: 3 mins
Gold Silver Rate Today | మళ్లీ తగ్గిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్దంతో పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిణామాల మార్పుల నేపథ్యంలో బంగారం, ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800తగ్గి రూ. 1,49,130వద్ద కొనసాగుతుంది, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,650 తగ్గి రూ. 1,36,700వద్ద నిలిచింది. వెండి ధర మాత్రం రూ.2,55,000వద్ద స్థిరంగా ఉంది.

గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు మార్చి నెలలో నేల చూపులు చూశాయి. సాధారణంగా వార్ ప్రభావంతో బంగారం ధరలు పెరగాలి. అయితే ఈ సారి అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇరాన్ యుద్ధ ప్రభావం బంగారం ధరల మీద అంతగా ప్రభావం చేపడం లేదు. ఈ రోజు ధరలను ఓ సారి చూసినట్లయితే భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలతో డాలర్ విలువ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల మీదకు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తగ్గుదల తాత్కాలికమేనని…మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Laddu Box | లక్షతో ‘లడ్డు’ బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!
Redmi A7 Pro | వెట్ టచ్ సపోర్టుతో రెడ్‌మీ నుంచి సరికొత్త మొబైల్.. ధర, ఫీచర్లు ఏంటంటే..!