స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!

గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ.1,55,570వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200పెరిగి రూ. 1,42,600కు చేరింది. కిలో వెండి ధర రూ. 2,75,000వద్ద స్థిరంగా ఉంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపుతున్నాయి. చమురు సంక్షోభంతో ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ ప్రభావం ఇతర మార్కెట్ల మీద కూడా పడింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. దీంతో పసిడి ధరలు మళ్లీ అమాంతంగా పుంజుకున్నాయి.

గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ.1,55,570వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200పెరిగి రూ. 1,42,600కు చేరింది. కిలో వెండి ధర రూ. 2,75,000వద్ద స్థిరంగా ఉంది.

పసిడి పరుగులపై భారీ అంచనాలు

పసిడి ప్రియులకు , ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చేలా అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్(UBS) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఏకంగా రూ. 30,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అదే జరిగితే, పసిడి ధర సామాన్యుడికి కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. యూబీఎస్ వ్యూహకర్త జియోవన్నీ స్టౌనోవో బృందం అంచనాల మేరకు 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 5,900 డాలర్లకు చేరుకోవచ్చు. దీనిని భారతీయ కరెన్సీలో లెక్కిస్తే, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,76,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుత ధర కంటే దాదాపు 20% మేర పెరగవచ్చు.

ధరలు పెరుగుదలకు కారణాలపై విశ్లేషణ

యూబీఎస్ అంచనాల మేరకు బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గింపు, .
సెంట్రల్ బ్యాంకుల బంగారం భారీగా కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల భయంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై పెరిగే పెట్టుబడులు, గోల్డ్ ఈటీఎఫ్‌లలో కొనుగోళ్లు 825 టన్నులకు చేరుకోవచ్చని అంచనాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

తక్కువ కొనుగోలు ప్రక్రియ శ్రేయస్కరం

బంగారం ధర రూ. 1.76 లక్షలకు చేరితే, పెళ్లిళ్ల కోసం నగలు కొనడం పెను భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు నిపుణులు కీలక సలహాలు చెబుతున్నారు. బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, ధరలు ఒక్కసారిగా కాకుండా హెచ్చుతగ్గులకు లోనవుతూ పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, ధర తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెం కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహమని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Gajwel Hospital | గ‌ర్భిణి బ‌రువు 139 కిలోలు.. 3.75 కిలోల ఆడ‌శిశువుకు జ‌న్మ‌
IRCTC Saurashtra Tour | రూ.30వేలలోనే ద్వారక-సోమనాథ్ యాత్ర.. ఐఆర్‌సీటీసీ 8 రోజుల ఆధ్యాత్మిక ట్రిప్!

Latest News