తగ్గిన బంగారం ధరలు

శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,57,040 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,950 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర రూ.2,90,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 30, 2026, 12:21 pm IST
Read Time: 2 mins
తగ్గిన బంగారం ధరలు

పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,57,040 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,950 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర రూ.2,90,000వద్ద కొనసాగుతుంది.

బంగారం ధరల తగ్గుదలతో కొనుగోలుకు ఇది మంచి అవకాశంగా మలచుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుత ధరల తగ్గుదల నిర్మాణాత్మకంగా ఉంటూ ఎక్కడా బలహీనత సంకేతాలు చూపనందునా, ధీర్ఘకాలంలో మళ్లీ బంగారం మరింత పైకి వెళ్లవచ్చంటున్నారు నిపుణులు. ఈ వారం బంగారం కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో 30-వారాల మూవింగ్ యావరేజ్ వద్ద మద్దతు లభించే అవకాశం ఉందని, భవిష్యత్తులో బంగారం రాబోయే రోజుల్లో మళ్లీ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వెండి ధర సైతం ప్రస్తుతం తగ్గుదల నమోదు చేసినప్పటికి మళ్లీ రూ. 3,00,000పైకి చేరితే అది సరికొత్త రికార్డుల పెరుగుదలకు మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.