Gold Rates | పసిడి పరుగో పరుగు.. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు
Gold Rates | బంగారాన్ని ఎంతో ఇష్టపడే మగువలకు షాకింగ్ న్యూస్ ఇది. పసిడి ధరలు తగ్గుతాయనుకుంటే రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి.
Gold Rates | బంగారాన్ని ఎంతో ఇష్టపడే మగువలకు షాకింగ్ న్యూస్ ఇది. పసిడి ధరలు తగ్గుతాయనుకుంటే రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. గురువారం మార్కెట్‌లో బంగారం ధర రూ. 90 వేల మార్క్ దాటింది. కిలో వెండి ధర రూ. లక్షా 15 వేలకు చేరుకుని మగువలకు భారీ షాక్‌ను ఇచ్చాయి.
గురువారం మార్చి 20 రోజున 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,910 కాగా, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.90,450 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,05,100 గా ఉంది.
ఆయా నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.83,060, 24 క్యారెట్ల ధర రూ.90,600 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల రేటు రూ.90,450 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,910, 24 క్యారెట్ల ధర రూ.90,450 గా ఉంది.

వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,14,100
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,14,100
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.105,100
ముంబైలో రూ.105,100
బెంగళూరులో రూ.105,100
చెన్నైలో రూ.1,14,100
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram