విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా మళ్లీ బలంగా పైకి లేస్తున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర ఒకేసారి రూ. 10,000 పెరిగి రూ. 2,60,000కు చేరింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత నెలలో ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గాయని, వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. దీంతో బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడ్డాయి. అయితే ధరలు తగ్గే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలు కొనుగోలు చేయడానికి ఒక సానుకూలంశంగా భావించవచ్చంటున్నారు.
.
