దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు తమ రికార్డు స్థాయి పెరుగుదల ధోరణిని కొనసాగిస్తున్నాయి. గడిచిన వారంలోనే బంగారం ధరలు ఏకంగా 6 శాతం మేర పెరిగి ఒక్కసారిగా రూ. 8,500 లాభపడగా,.. వెండి ధరలు ఏకంగా 7 శాతం చొప్పున రూ. 14,300 పెరిగి ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. వచ్చే వారం కూడా పసిడి తన జోరును కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయనొ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,160 పెరిగి రూ.1,55,130కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,900 పెరిగి రూ. 1,42,200వద్ద నిలిచింది. వెండి ధర సైతం ఒకేసారి రూ. 10,000 పెరిగి రూ.1,60,000వద్ద కొనసాగుతుంది. యూఎస్ జూలై ఉద్యోగ గణాంకాలు తగ్గడం, ఫెడరల్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం,
మరోసారి ఆల్ టైమ్ రికార్డు దిశగా పసిడి, వెండి పరుగులు
జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ అంచనా మేరకు బంగారం, వెండి ట్రెండ్ చాలా సానుకూలంగా ఉందన్నారు. రాబోయే స్వల్పకాలంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.57 లక్షలు, అలాగే కిలో వెండి ధర రూ. 2.80 లక్షల ఆల్-టైమ్ రికార్డు స్థాయి లక్ష్యానికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
మరోవైపు వచ్చే 12 నుండి 15 నెలల కాలవ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర క్రమంగా 4,800 డాలర్లకు.. ఆ తర్వాత 5,500 డాలర్లకు ఎగబాకే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తన ‘హెచ్1 2026 విలువైన లోహాల నివేదిక’లో పేర్కొంది. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రేటు మధ్యకాలంలో రూ. 1.68 లక్షల దిశగా పయనించి.. రాబోయే 12-15 నెలల కాలంలో ఏకంగా రూ. 1.93 లక్షల ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరవచ్చని జ్యోస్యం చెప్పింది.
పసిడి పరుగుకు బులియన్ మార్కెట్‌లో నెలకొన్న ఈ అనూహ్య ర్యాలీకి ప్రధానంగా అమెరికా నుంచి వచ్చిన ఉపాధి నివేదికలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫెడరల్ బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనత వంటి ఆర్థిక అంశాలు బంగారం, వెండి ధరల భవిష్యత్ గమనాన్ని నిర్దేశించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక గణంకాలలో అనూహ్య మార్పులు సంభవిస్తే.. అత్యుత్తమ ‘కొనుగోలు జోన్’ తులం బంగారం ధర రూ.1,33,000 ధరను పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
