• Telugu News
  • /Business

Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర..! ఏంత పెరిగాయో తెలుసా..?

Gold-Silver Rates | పసిడి ధరలు మగవులకు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా నిలకడగా కొసాగిన ధరలు మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి రూ.66,350కి ఎగసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.100 పెరిగి తులానికి రూ.72,380కి పెరిగింది. మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 02, 2024, 11:35 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర..! ఏంత పెరిగాయో తెలుసా..?

Gold-Silver Rates | పసిడి ధరలు మగవులకు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా నిలకడగా కొసాగిన ధరలు మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి రూ.66,350కి ఎగసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.100 పెరిగి తులానికి రూ.72,380కి పెరిగింది. మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,980కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,380కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,520కి పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.800 పెరిగి.. ఢిల్లీలో ధర వెండి రూ.91వేలకు చేరింది. హైదరాబాద్‌లో రూ.95,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.