Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. పూనావాలా ఫిన్‌కార్ప్ కొత్త పథకం

Fincorp: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. పూనావాలా ఫిన్‌కార్ప్ కొత్త పథకం

ముంబై: సైరస్ పూనావాలా గ్రూప్‌ ప్రమోటర్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) కొత్తగా షాప్‌కీపర్ లోన్ బిజినెస్‌ను ఆవిష్కరించింది. క్యాష్ ఫ్లో, నిల్వలు, కస్టమర్ల నిర్వహణ సహా చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలు ఎదుర్కొనే కీలక ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

వారు తమ నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చుకునేందుకు తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాదారులకు అనువైన ఆర్థిక సొల్యూషన్స్‌ను అందించాలని సంస్థ నిర్దేశించుకుంది. తొలి దశలో 44 ప్రాంతాల్లో పీఎఫ్‌ఎల్ కార్యకలాపాలు ఆవిష్కరించనుంది. షాప్‌కీపర్ లోన్ బిజినెస్‌తో పీఎఫ్ఎల్ మొత్తం మీద 4 కొత్త వ్యాపారాలను ప్రారంభించినట్లవుతుంది.

“భారతదేశ చిన్న రిటైలర్లు, మన కన్జూమర్ ఎకానమీకి వెన్నెముకలాంటివారు. అయినప్పటికీ సకాలంలో రుణ సదుపాయం అందుబాటులో లేకపోవడమనేది వారి వృద్ధికి అవరోధంగా ఉంటోంది. వారి నిర్వహణ మూలధన అవసరాలను తీర్చే విధమైన సొల్యూషన్స్ అందించడం ద్వారా, దీర్ఘకాలికంగా వ్యాపారానికి దన్నుగా నిల్చేలా షాప్‌కీపర్ లోన్ ద్వారా ఈ అంతరాన్ని భర్తీ చేయాలని నిర్దేశించుకున్నాం. గణనీయంగా పోటీ ఉండే రిటైల్ రంగంలో తమ వ్యాపారాలను నిలబెట్టుకోవడంలో వారికి సాధికారత కల్పించాలని భావిస్తున్నాం” అని పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అరవింద్ కపిల్ తెలిపారు.