Zettai: జెట్టై పునర్నిర్మాణ పథకానికి రుణదాతల గట్టి మద్దతు.. 93.1% అనుకూలం

  • Publish Date - April 17, 2025 / 11:34 AM IST

Zettai:

సింగపూర్: జెట్టై ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన పునర్నిర్మాణ పథకానికి రుణదాతల నుంచి బలమైన ఆమోదం లభించిందని ఆ సంస్థ తెలిపింది. WazirX వేదికపై క్రిప్టో బ్యాలెన్స్‌లు కలిగిన రుణదాతలంతా సింగపూర్ హైకోర్టులో దాఖలైన ఈ పథకానికి ఓటు వేసే అర్హత పొందారు. మార్చి 19 నుంచి మార్చి 28 వరకు క్రోల్ ఇష్యూయర్ సర్వీసెస్ వేదికపై ఈ ఓటింగ్ జరిగింది.

మొత్తం 141,476 మంది రుణదాతలు, 195.65 మిలియన్ డాలర్ల ఆమోదిత క్లెయిమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఓటు వేశారు. వీరిలో 131,659 మంది, 184.99 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌లతో, పథకానికి అనుకూలంగా ఓటేశారు. ఇది ఓటు వేసిన రుణదాతల్లో 93.1%, క్లెయిమ్ విలువలో 94.6% మద్దతును సూచిస్తుంది. ఈ ఆమోదం కంపెనీల చట్టం సెక్షన్ 210(3AB) కింద అవసరమైన 75% కనీస మద్దతు పరిమితిని అధిగమించింది.

తక్కువ నుంచి అత్యధిక క్లెయిమ్‌ల రుణదాతల వరకు, 92% నుంచి 95% మధ్య స్థిరమైన ఆమోదం కనిపించింది. క్లెయిమ్ విలువతో సంబంధం లేకుండా, జెట్టైకి విభిన్న రుణదాతల నుంచి సమాన మద్దతు లభించడం పునర్నిర్మాణ పథకంపై విస్తృత సమ్మతిని చూపిస్తుంది. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు, జెట్టై… ఓట్లను అల్వారెజ్ & మార్సల్ స్వతంత్ర అసెసర్లు (జాషువా టేలర్, హెన్రీ ఆంథోనీ ఛాంబర్స్) ద్వారా ధృవీకరించింది.

సమగ్ర పరిశీలన అనంతరం, స్వతంత్ర అసెసర్ ఓటింగ్ ఫలితాల నివేదికను జెట్టై, స్కీమ్ మేనేజర్‌కు అందజేశారు.ఓటింగ్ ఫలితాలతో కూడిన నివేదిక త్వరలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫలితాలతో, జెట్టై సింగపూర్ కోర్టులో పథకం ఆమోదం కోసం దరఖాస్తు చేయనుంది. కోర్టు ఆమోదం పొందిన తర్వాత, జెట్టై చట్టపరమైన దాఖలు కాపీతో రుణదాతలకు అప్‌డేట్ అందిస్తుంది. కోర్టు అనుమతి పొందిన తర్వాత, స్కీమ్ చట్టబద్ధంగా అమలులోకి వచ్చిన 10 పని దినాల్లో మొదటి పంపిణీ ప్రారంభమవుతుంది. నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారు సౌలభ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, విత్‌డ్రాయల్స్, ట్రేడింగ్ దశలవారీగా పునఃప్రారంభమవుతాయి.