LPG Price Cut | ఎన్నికల ఫలితాలకు ముందు తీపికబురు చెప్పిన కేంద్రం.. సిలిండర్ ధర తగ్గింపు..!
LPG Price Cut | నేడు దేశంలో లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నెల 4న ఫలితాలు వెల్లడవనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఊరట కల్పించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించింది.
LPG Price Cut | నేడు దేశంలో లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నెల 4న ఫలితాలు వెల్లడవనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఊరట కల్పించింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించింది. ప్రతి నెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.72 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1975.50గా ఉన్నది. కోల్‌కతాలో రూ.1787, ముంబయిలో రూ.1629, చెన్నైలో రూ.1840.50కి తగ్గింది.
బిహార్ పాట్నాలో రూ.1932, లక్నోలో రూ.1789, బెంగళూరులో రూ.1755గా ఉంది. కాగా, మే 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.20 వరకు తగ్గిన విషయం తెలిసిందే. మరో వైపు గృహ వినియోగ వంటగ్యాస్ ధరను కంపెనీలు యథావిధిగా కొనసాగించాయి. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ల ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.803గా ఉన్నది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.603 వద్ద కొనసాగుతున్నది. డొమెస్టిక్ సిలిండర్లు కోల్‌కతాలో రూ.829కి, ముంబైలో రూ.802.50కి, చెన్నైలో రూ.818.50కి ధర పలుకుతున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram