Maruti Suzuki | రూ.5.5 లక్షల్లోపే మైక్రో SUV.. టాటా పంచ్‌కు మారుతి సుజుకీ సవాల్!

Maruti Suzuki | దేశంలో SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకీ కొత్త మైక్రో ఎస్‌యూవీ తయారీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టాటా పంచ్(Tata Punch)కు గట్టి పోటీగా మారే అవకాశం ఉందని ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Maruti Suzuki | భారత్‌లో చవకైన కార్లకు పేరొందిన కంపెనీ మారుతి సుజుకీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిడిల్ క్లాస్ కస్టమర్లే లక్ష్యంగా కొత్త కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్న ఈ కంపెనీ.. దేశంలో SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కొత్త మైక్రో SUV తయారీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో సక్సె్స్ అయిన టాటా పంచ్ (Tata Punch) కారుకు గట్టి పోటీగా ఈ కొత్త మోడల్‌‌ను తీసుకురానుంది.

SUV సెగ్మెంట్లపైనే కస్టమర్ల ఇంట్రెస్ట్

గత కొంతకాలంగా కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే కూడా ఎస్‌యూవీ మోడల్స్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మారుతి సుజుకీ కంపెనీ ఆ దిశగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరు మోడళ్లతో కూడిన విస్తృత SUV లైనప్ నిర్మించి బలమైన స్థానాన్ని సంపాదించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో SUV మార్కెట్‌లో వాటాను 16.8 శాతం నుంచి 19.6 శాతానికి పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే SUV సెగ్మెంట్‌ను మరింత విస్తరించేందుకు మారుతి సుజుకీ ఇప్పుడు మైక్రో SUV తయారీపైనా ఫోకస్ చేసింది. కొత్తగా Y43 అనే కోడ్‌నేమ్‌‌తో మైక్రో ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తుంది. బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.

డిజైన్లు-ఫీచర్లు

ఈ కొత్త మైక్రో SUVలో నిలువుగా ఉన్న స్టైలింగ్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇది 3.8 మీటర్ల పొడవు, 1.7 మీటర్లకు పైగా వెడల్పు, 1.6 మీటర్లకుపైగా ఎత్తుతో ఈ మోడల్ రానుంది. అలాగే దాదాపు 2.5 మీటర్ల వీల్‌బేస్‌తో వస్తూ.. లోపల ఎక్కువ స్పేస్ అందించేలా డిజైన్ చేస్తున్నారు. స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్లతో తక్కువ ధరకే అందించేలా మారుతి సుజుకీ యోచిస్తుంది.
ఇంజిన్

ఈ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ మోడల్‌ను HEARTECT ఫ్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే స్విఫ్ట్(Maruti Suzuki Swift), డిజైర్(Maruti Suzuki Dzire), బలెనో(Maruti Suzuki Baleno), ఫ్రాంక్స్(Maruti Suzuki Fronx) వంటి మాడళ్లు వచ్చాయి.

ఇంజిన్ విషయానికి వస్తే

* 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ (మైల్డ్ హైబ్రిడ్)
* 1.0 లీటర్ టర్బో పెట్రోల్
* మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ‌బాక్స్ ఎంపికలు

CNG వేరియంట్‌‌ కూడా!

నగర ప్రయాణాలకు సరిపోయేలా మైలేజ్, పనితీరు అందించేలా దీన్ని ట్యూన్ చేసే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్ ఆధారంగా CNG వేరియంట్‌‌ను కూడా అందించే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ధర కూడా మిడిల్ క్లాస్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

5.5 లక్షల్లోపే ధర!

ఈ మైక్రో SUV మోడల్ బేస్ వేరియంట్ ఎక్స్‌ షోరూం ధర రూ.5.25 లక్షల నుంచి 5.5 లక్షల మధ్య ఉంచే అవకాశం ఉంది. 2027 ప్రారంభంలో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని మారుతి సుజుకీ కంపెనీ ప్లాన్ చేస్తుంది. దీంతో ఈ మోడల్ మార్కెట్‌లోకి వస్తే బడ్జెట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Read More :

మిడిల్ క్లాస్‌‌‌ కస్టమర్లను టార్గెట్ చేసిన ఆడి.. లగ్జరీ బ్రాండ్‌ నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు!

కేవలం 6 లక్షలకే 7 సీటర్ కారు.. ఫ్యామిలీ ట్రిప్‌లకు వెళ్లే వారే టార్గెట్‌‌గా నిసాన్ కొత్త కారు!

Latest News