Muthoot: అత్యుత్తమ ESG స్కోరును సాధించిన ముథూట్ మైక్రోఫిన్

Muthoot: అత్యుత్తమ ESG స్కోరును సాధించిన ముథూట్ మైక్రోఫిన్

కోచి: సుస్థిర, సమ్మిళిత ఫైనాన్స్‌పై నిబద్ధతకు నిదర్శనంగా, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ అత్యుత్తమ 72.2 ESG స్కోరును సాధించించింది. తద్వారా SEBI లైసెన్స్ పొందిన CARE ESG రేటింగ్స్ లిమిటెడ్ నుంచి అత్యున్నత CareEdge-ESG 1 రేటింగ్‌ను పొందింది. దీంతో భారత ఆర్థిక సేవల రంగంలో ESG అగ్ర సంస్థల సరసన చేరింది. నైతిక గవర్నెన్స్, కమ్యూనిటీ-కేంద్రిత ఫైనాన్స్, బాధ్యతాయుత వృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈఎస్జీ రిస్క్ నిర్వహణలో ‘లీడర్‌షిప్’ స్థానాన్ని ఈ రేటింగ్ సుస్పష్టం చేస్తుంది. ఈ పరిశ్రమలో CARE ఇచ్చిన అత్యధిక స్కోరు ఇదే.

గ్రామీణ భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సాధికారత నుంచి క్లైమేట్ రిస్క్ ఇంటిగ్రేషన్, సమ్మిళిత వర్క్‌ప్లేస్ విధానాల వరకు, ముథూట్ మైక్రోఫిన్ తన కార్యకలాపాల్లో పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ అంశాలను అత్యుత్తమంగా అమలు చేస్తోంది.

ముథూట్ మైక్రోఫిన్ ESG నాయకత్వ హైలైట్స్:

  • గవర్నెన్స్ స్కోరు: 78.9(పరిశ్రమ సగటు 64.5): వైవిధ్య బోర్డు, ISO 27000 డేటా భద్రత, నైతికత, అవినీతి నిరోధక, విజిల్‌బ్లోయింగ్ విధానాలు.
  • సామాజిక స్కోరు: 72.1 (పరిశ్రమ సగటు 56.5):
  • 100% మహిళా రుణగ్రహీతలు
  • 95% పరిష్కార రేటుతో అత్యుత్తమ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ
  • సమాన వేతనం (1:1 పురుష-మహిళ నిష్పత్తి), ఆరు సార్లు గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్
  • పర్యావరణ స్కోరు: 54.6 (టాప్ క్వార్టైల్):
  • 50 శాఖల్లో రూఫ్‌టాప్ సోలార్, ₹27.5 కోట్ల హరిత రుణాలు
  • 2040 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యం
  • ESG రిస్క్ రిజిస్టర్, క్లైమేట్ రిస్క్ ఫ్రేమ్‌వర్క్

FY24లో డేటా ఉల్లంఘనలు లేకుండా, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌కు అనుగుణంగా ముథూట్ మైక్రోఫిన్ అత్యుత్తమ డేటా గవర్నెన్స్‌ను పాటిస్తున్నట్లు తెలిపింది.