Grape Cultivation | సిరులు కురిపిస్తున్న ద్రాక్ష సాగు.. ఏడాదికి రూ. 75 లక్షలు సంపాదిస్తున్న యువ రైతు
Grape Cultivation | చదువుకుంటనే, ఉద్యోగం చేస్తేనే జీవితంలో ఆర్థికం( Finance )గా ఎదుగుతాం అనుకోవడం పొరపాటు. వ్యవసాయం( Agriculture ) చేస్తూ కూడా ఆర్థికంగా ఎదగొచ్చు. ఉద్యోగస్తుల కంటే అధికంగా డబ్బు సంపాదించొచ్చు. అందుకు ఈ యువ రైతే( Young Farmer ) ఉదాహరణ. హోటల్ మేనేజ్‌మెంట్( Hotel Management )లో పట్టభద్రుడైన ఈ యువకుడు.. ద్రాక్ష సాగు( Grape Cultivation ) చేస్తూ ఏడాదికి రూ. 75 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు. మరి ఆ యువకుడి సక్సెస్ తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra )లోని నాసిక్( Nashik )లో కాలు మోపాల్సిందే.
Grape Cultivation | మహారాష్ట్ర( Maharashtra )లోని మొహాది గ్రామానికి చెందిన గణేశ్ కదమ్( Ganesh Kadam ) 2004లో నాసిక్( Nashik )లో హోటల్ మేనేజ్‌మెంట్( Hotel Management )లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఇదే విషయాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పని చేస్తున్న తన తండ్రికి చెప్పాడు. మొహదీలో ఉన్న రెండెకరాల భూమిని అమ్మితేనే హోటల్ వ్యాపారం సాధ్యమవుతుందని గణేశ్‌కు తండ్రి చెప్పాడు. కానీ భూమి అమ్మేందుకు గణేశ్‌కు మనసు ఒప్పుకోలేదు.
హోటల్ బిజినెస్‌కు వద్దనుకుని.. వ్యవసాయం వైపు అడుగులు
ఇక హోటల్ బిజినెస్‌ను వద్దనుకుని వ్యవసాయ పొలంలో అడుగుపెట్టాడు గణేశ్. తన విద్యను, వ్యాపార ఆలోచణను వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సొంతూరిలో ఖాళీగా ఉన్న రెండెకరాల భూమిని సాగుకు అనుగుణంగా మల్చాడు. 2005-06లో ఉన్న రెండెకరాల పొలంలో ద్రాక్ష సాగును ప్రారంభించాడు. సుమారు 2 వేల మొక్కలను నాటాడు.
మొదటి పంటలోనే అతను రూ. 1.5 లక్షల లాభం

మనషులకు హానీకరం కలిగించే రసాయనాలను ద్రాక్ష సాగుకు వినియోగించొద్దని గణేశ్ నిర్ణయించుకున్నాడు. దీంతో సేంద్రీయ పద్ధతిని ఎంచుకున్నాడు. సేంద్రీయ విధానంలో ద్రాక్ష సాగును చేయడం మూలంగా మొదటి పంటలోనే అతను రూ. 1.5 లక్షల లాభం ఆర్జించాడు. లాభాలు రావడంతో గణేశ్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాడు. తన సాగును విస్తరించాడు.
రెండెకరాల నుంచి 14 ఎకరాలకు..
బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెండెకరాల నుంచి నాలుగు ఎకరాలకు ద్రాక్ష సాగును విస్తరించాడు. మరింత లాభాలు గడించడంతో.. ఏడాదికి ఏడాది తన సాగును మొత్తం 14 ఎకరాలకు విస్తరించాడు. ఇందులో సొంత భూమి 11 ఎకరాలు కాగా, మరో మూడెకరాలు లీజుకు తీసుకుని ద్రాక్ష సాగు చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు గణేశ్.
విదేశాలకు ద్రాక్ష ఎగుమతి..
గణేశ్ థాంప్సన్ సీడ్‌లెస్, క్రిమ్సన్, చెర్రీ క్రంచ్‌తో పాటు ARRA-36 రకానికి చెందిన గ్రీన్, బ్లాక్, రెడ్ కలర్ ద్రాక్షను పండిస్తున్నాడు. ఇందులో మూడింట రెండొంతులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ముఖ్యంగా యూరప్, కెనడా, చైనా దేశాలకు తమ ద్రాక్ష ఎగుమతి అవుతుందన్నాడు గణేశ్.
సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు

పొలం బాట పట్టి.. ఏడాదికి లక్షల రూపాయాలు సంపాదిస్తున్న గణేశ్‌కు సరికొత్త ఆలోచన వచ్చింది. కొవిడ్ సమయంలో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఎండు ద్రాక్షను కూడా ప్రాసెస్ చేయాలనుకున్నాడు. 2022లో రూ. 1.5 లక్షలతో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్( Solar Dehydration Unit )ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎండు ద్రాక్షను ప్రాసెస్ చేయడం ప్రారంభించాడు. కొన్ని సందర్భాల్లో గ్రేడింగ్, సార్టింగ్ సమయంలో ద్రాక్ష తన ప్రామాణికతను కోల్పోతుంది. గుత్తి నుండి రాలిపడిన పాడైన లేదా చిన్న ద్రాక్ష పండ్లను మార్కెట్‌లో కిలోకు రూ. 10-15కు అమ్ముతారు. వాటిని ఎండుద్రాక్షగా మార్చడం ద్వారా, అదే పంటను కిలోకు సుమారు రూ. 200కు అమ్ముతున్నట్లు గణేశ్ వివరించాడు.
5 కిలోల తాజా ద్రాక్షతో ఒక కిలో ఎండు ద్రాక్ష

సుమారు 5 కిలోల తాజా ద్రాక్షను ప్రాసెస్ చేస్తే ఒక కిలో ఎండు ద్రాక్ష లభిస్తుంది. అయితే ద్రాక్షను ఎండు ద్రాక్షగా మార్చేందుకు సూర్యరశ్మిలో ఆరబెట్టాలి. ఆరేందుకు కనీసం 22 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. అంతేకాకుండా నాణ్యతను, రంగును కాపాడేందుకు సల్ఫర్ డయాక్సైడ్‌ను వినియోగిస్తారు. కానీ సోలార్ డీహైడ్రేటర్‌లో ద్రాక్షను ఎండుద్రాక్షగా మార్చడానికి కేవలం 10-15 రోజులు మాత్రమే పడుతుంది. కాలుష్యం లేదా కల్తీ అయ్యే ప్రమాదం లేదు. అంతా సహజమైనదే అని గణేశ్ తెలిపాడు.
గతేడాది రూ. 75 లక్షల టర్నోవర్
సోలార్ డీహైడ్రేషన్ యూనిట్‌లో తన ద్రాక్ష పంటను మాత్రమే ప్రాసెస్ చేయడం లేదు. ఇతర రైతుల నుంచి సేకరించిన అల్లం, టమాటాలు, పుదీనా, కొత్తిమీర వంటి వాటిని డీహైడ్రేట్ చేస్తున్నారు. ఇలా ఇతర రైతుల వ్యవసాయ ఉత్పత్తులను డీహైడ్రేట్ చేయడం ద్వారా ఏడాదికి రూ. 5 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు గణేశ్. ఇక ద్రాక్ష ప్రాసెస్ వల్ల 60 శాతం లాభాలను ఆర్జిస్తున్నాడు. ఏడాదికి 1200 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాడు. ఇందులో 800 టన్నులను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా, మిగతా 400 టన్నులను దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నాడు. అలా గతేడాది రూ. 75 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు యువ రైతు గణేశ్.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram