Royal Enfield Hunter 350 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో నయా వేరియంట్.. అలాయ్ వీల్స్.. ట్యూబ్‌లెస్ టైర్లతో లాంచ్!

Royal Enfield Hunter 350 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రాచుర్యం పొందిన హంటర్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. హంటర్ 350 బేస్ ప్రీమియం పేరుతో ఈ వేరియంట్‌ను తీసుకొచ్చింది.

Reported by: Chandram | వాణిజ్యం | Apr 06, 2026, 9:51 pm IST
Read Time: 5 mins
Royal Enfield Hunter 350 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో నయా వేరియంట్.. అలాయ్ వీల్స్.. ట్యూబ్‌లెస్ టైర్లతో లాంచ్!

Royal Enfield Hunter 350 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రాచుర్యం పొందిన హంటర్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. హంటర్ 350 బేస్ ప్రీమియం పేరుతో ఈ వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు నూతన రంగు ఎంపికలను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ ధరను రూ.1.50 లక్షలు (చెన్నై ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.

ఈ హంటర్ 350 బేస్ ప్రీమియం వేరియంట్.. ఇప్పటికే ఉన్న ఎంట్రీ లెవల్ ఫ్యాక్టరీ బ్లాక్ కంటే పైస్థాయిలో నిలిచింది. బేస్ మోడల్‌లో స్పోక్ వీల్స్ ఉండగా.. ఈ కొత్త వేరియంట్‌లో 17 అంగుళాల అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. ముందు టైర్ 100 సెక్షన్, వెనుక 120 సెక్షన్ సైజ్ టైర్లు ఉన్నాయి. ఇవి ఇతర హంటర్ మోడళ్లతో పోలిస్తే కొద్దిగా సన్నగా ఉన్నప్పటికీ.. నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు.

ఈ బేస్ వేరియంట్‌లో 55W శక్తివంతమైన హాలోజన్ హెడ్‌ల్యాంప్ అమర్చారు.. ఇది బేస్ వేరియంట్‌లో ఉన్న దానికంటే (35W) మెరుగైన వెలుతురు అందిస్తుంది. ఈ వేరియంట్‌లో అదనంగా పైలట్ ల్యాంప్ కూడా ఉండటం గమనార్హం. అలాగే క్లచ్ లివర్ కింద USB – C చార్జింగ్ పోర్టును ఏర్పాటు చేశారు. అయితే హైయర్ వేరియంట్‌లో పోలిస్తే కాస్త నెమ్మదిగా చార్జింగ్ అవుతుందని సమాచారం.

ఇంజిన్ పరంగా ఈ బేస్ వేరియంట్‌లో పెద్దగా మార్పులు లేవు. గతంలో మాదిరిగానే 349సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 20 హెచ్‌పీ పవర్, 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు 300మి.మీ. డిస్క్, వెనుక 153మి.మీ. డ్రమ్ బ్రేక్‌తో పాటు సింగిల్ చానల్ ABSను అందించారు. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఒక ప్రామాణిక ఫీచర్‌గా లభిస్తుంది. ఈ మోడల్ బైక్ 36.2kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ బేస్ వేరియంట్ ఇప్పుడు నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. వీటిలో బేస్, బేస్ ప్రీమియం, మిడ్, టాప్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1.38లక్షల నుంచి రూ.1.70 లక్షలు (ఎక్స్ షోరూం) వరకు ఉంటాయి. ఇక Hunter 350లో కొత్తగా మూన్‌షాట్ వైట్, ముంబై ఎల్లో కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బేస్ ప్రీమియం వేరియంట్‌లో కేవలం టార్మాక్ బ్లాక్ అనే సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉండటం గమనార్హం.

Read More :

Royal Enfield Hunter 350 | శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

Royal Enfiled Guerilla 450 | రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్‌ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!