OnePlus | పవర్‌ఫుల్‌ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనున్న వన్‌ప్లస్‌..!

OnePlus | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్నది. శక్తివంతమైన 6,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్‌ను తీసుకురాబోతున్నది వన్‌ప్లస్‌.

OnePlus | పవర్‌ఫుల్‌ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనున్న వన్‌ప్లస్‌..!

OnePlus | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్నది. శక్తివంతమైన 6,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్‌ను తీసుకురాబోతున్నది వన్‌ప్లస్‌. ఇప్పటి వరకు సామ్‌సంగ్‌, ఇన్ఫినిక్స్‌, మోటరోలా, వివో తదితర బ్రాండ్స్‌కు చెందిన 6వేల ఎంఏహెచ్‌ అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మొబైల్స్‌ను విక్రయిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలో వన్‌ప్లస్‌ సైతం చేరబోతున్నది.

వన్‌ప్లస్‌ ఈ మొబైల్‌ను ‘వన్‌ప్లస్‌ ఏస్‌3 ప్రోగా నామకరణం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే, గతేడాది కంపెనీ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన వన్‌ప్లస్‌ ఏ2 ప్రోతో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం 10శాతం అధికంగా ఉంటుందని తెలుస్తున్నది. 600 ఎంఏహెచ్ కెపాసిటీ ఎక్కువగా లభించనుందని చైనీస్ టిప్‌స్టర్ ప్లాట్‌ఫామ్ ‘వైబో‘ తెలిపింది. ఈ మొబైల్‌ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్స్ సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుందని వివరించింది. ఫోన్‌లో రెండు 2,970 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌లు అమర్చి ఉంటాయని, రెండు కలిపి మొత్తం 6,100 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని అందిస్తాయని వివరించింది. ఇక వన్‌ప్లస్ ఏస్ 3ప్రో ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేయనుందని టాక్‌ నడుస్తున్నది.

120హెచ్‌జెడ్ ఎల్‌టీపీవో రిఫ్రెష్ రేట్, 6.78-అంగుళాల 1.5కే రిజల్యూషన్ డిస్‌ప్లే, 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్ననల్ స్టోరేజీ, 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుందని టాక్‌. ఇక మొబైల్‌ ధర రూ.39వేల వరకు ఉండవచ్చని అంచనా. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నది.