PhonePe | ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై 6 రకాల సెక్యూర్డ్ లోన్ స్కీమ్స్..!
PhonePe | డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్స్, పసిడి, ద్విచక్ర వాహనం, కారు, గృహ/ఆస్తి తనఖా, విద్యా విభాగాల్లో రుణాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

PhonePe : డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్ మీద 6 విభాగాల్లో సెక్యూర్డ్ రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్స్, పసిడి, ద్విచక్ర వాహనం, కారు, గృహ/ఆస్తి తనఖా, విద్యా విభాగాల్లో రుణాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇందుకోసం బ్యాంకులతోపాటు టాటా కేపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లాంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 15 భాగస్వామ్య సంస్థలు ఉండగా.. వచ్చే త్రైమాసికంకల్లా ఈ సంఖ్యను 25కు పెంచుకోవాలని ఫోన్‌పే లక్ష్యంగా పెట్టుకుంది.
‘డిజిటల్ పద్ధతిలో సెక్యూర్డ్ రుణాల మంజూరుపై ఆర్థిక సంస్థలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. అందువల్ల ఈ సేవల ప్రారంభానికి ఇదే అత్యుత్తమ సమయం అని భావిస్తున్నాం’ని ఫోన్‌పే లెండింగ్ సీఈవో హేమంత్ గలా తెలిపారు.