Poco C65 | అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,799కే AI ట్రిపుల్ కెమెరా ఫోన్
Poco C65 | మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీ కోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే ఇప్పుడు పాపులర్ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో Poco C65 ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆ ఆఫర్ వివరాలు, ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Poco C65 : మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీ కోసం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్‌లో చాలా తక్కువ ధరకే ఇప్పుడు పాపులర్ మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో Poco C65 ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆ ఆఫర్ వివరాలు, ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా Poco C65 మొబైల్ ధర రూ.10,999 గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్ ఆ ఫోన్‌ను ఇప్పుడు రూ.6,799 కే ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైనది ఏమిటంటే 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా. అదేవిధంగా 6.74 అంగుళాల HD + LCD డిస్‌ప్లేతో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.
ఇది 720 x 1,600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పై నడుస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్, 8GB వరకు RAM ఉంది. కెమెరా విషయానికొస్తే ఈ Poco ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో తెలియని డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Poco C65 ఇంటర్నల్ మెమరీ 256GB వరకు ఉంది. దీనిని కార్డ్ సాయంతో విస్తరించవచ్చు. అదేవిధంగా ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్‌లో సైడ్ మౌంట్ చేయబడింది. కనెక్టివిటీ కోసం దీనిలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, 3.5mm ఆడియో జాక్‌లకు సపోర్ట్ ఉంది.