Godrej: గోద్రెజ్ ప్రాపర్టీస్ అరుదైన ఘనత

Godrej: గోద్రెజ్ ప్రాపర్టీస్ అరుదైన ఘనత

ముంబై: రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ అరుదైన ఘనత సాధించింది. ఆర్థిక సంవత్సరం, త్రైమాసికాలవారీ గాను అత్యధిక బుకింగ్స్ నమోదు చేసినట్లు ప్రకటించింది. త్రైమాసికాల వారీ గాను, పూర్తి సంవత్సరానికి గాను గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధిక బుకింగ్స్ నమోదు చేసింది. బుకింగ్ విలువ Q4 FY25లో QoQ ప్రాతిపదికన 87%, YoY ప్రాతిపదికన 7% పెరిగి రూ. 10,163 కోట్లకు చేరింది. 7.52 మిలియన్ చ.అ.విస్తీర్ణంలో మొత్తం 3,703 గృహాల విక్రయం ద్వారా ఇది సాధ్యపడింది. గోద్రెజ్ ప్రాపర్టీస్‌కి సంబంధించి ఇది త్రైమాసికాలవారీగా అత్యధిక బుకింగ్స్ రికార్డు.

జీపీఎల్ రూ. 5,000 కోట్లకు పైగా బుకింగ్ వేల్యూను సాధించడం ఇది వరుసగా 7వ త్రైమాసికం. YoY ప్రాతిపదికన FY25 బుకింగ్ వేల్యూ 31 శాతం పెరిగి రూ. 29,444 కోట్లకు చేరింది. 25.73 మిలియన్ చ.అ. విస్తీర్ణంతో, YoY ప్రాతిపదికన 29 శాతం వాల్యూమ్ వృద్ధితో 15,302 గృహాల విక్రయం ద్వారా ఇది సాధ్యపడింది. పూర్తి సంవత్సర బుకింగ్ వేల్యూ, వాల్యూమ్‌పరంగా, భారత్‌లో ఇప్పటివరకు ఏ ఇతర రియల్ ఎస్టేట్ డెవలపర్‌కైనా ఇది అత్యధికం కావడం విశేషం.  FY25 బుకింగ్ వేల్యూకి సంబంధించి ఇచ్చిన వార్షిక గైడెన్స్‌కి మించి జీపీఎల్ 109 శాతం సాధించింది. వరుసగా 8వ ఆర్థిక సంవత్సరమైన FY25లోనూ జీపీఎల్ యొక్క బుకింగ్ వేల్యూ వృద్ధి చెందింది. నోయిడాలో గోద్రెజ్ రివరిన్ (Godrej Riverine)తో పాటు పలు కీలక కొత్త ప్రాజెక్టులకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడమనేది Q4 FY25లో అమ్మకాలకు తోడ్పడింది. గోద్రెజ్ రివరిన్ రూ. 2,000 కోట్ల పైగా బుకింగ్ వేల్యూ నమోదు చేసింది. అలాగే గురుగ్రామ్‌లోని గోద్రెజ్ ఆస్ట్రా రూ. 1,000 కోట్లపైగా బుకింగ్ వేల్యూను నమోదు చేసింది. హైదరాబాద్‌లోని గోద్రెజ్ మాడిసన్ ఎవెన్యూ రూ. 1,000 కోట్ల బుకింగ్ వేల్యూ సాధించింది. FY25లో ఎన్‌సీఆర్, ఎంఎంఆర్, బెంగళూరులో వరుసగా రూ. 10,500 కోట్లు, రూ.8,000 కోట్లు, రూ.5,000 కోట్ల పైగా బుకింగ్ వేల్యూ నమోదైంది.

“Q4FY25లో తొలిసారిగా సేల్స్ బుకింగ్స్‌ రూ. 10,000 కోట్లు దాటడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. గత 3 సంవత్సరాలుగా మా సేల్స్ బుకింగ్స్ వార్షికంగా 55 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. దీనితో జీపీఎల్ తమ కార్యకలాపాల స్థాయిని సమూలంగా రీసెట్ చేసుకోగలిగింది. బుకింగ్ వేల్యూపరంగా వరుసగా రెండో ఏడాదీ భారత్‌లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా నిల్చింది. గోద్రెజ్ ప్రాపర్టీస్‌పై నమ్మకం ఉంచినందుకు గాను మా కస్టమర్లు, భాగస్వాములకు ధన్యవాదాలు. FY25లో రూ. 26,450 కోట్ల ఫ్యూచర్ బుకింగ్ వేల్యూతో రాబోయే రోజుల్లో మా ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 2024లో క్యూఐపీ ద్వారా సమీకరించిన రూ. 6,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌కి, FY25లో ఆర్జించిన ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా తోడై మేము తదుపరి వృద్ధిపై పెట్టుబడులను కొనసాగించేందుకు తోడ్పడగలదు.రాబోయే రోజుల్లో కీలకమైన వివిధ కొలమానాలవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబరుస్తాం” అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ & సీఈవో గౌరవ్ పాండే తెలిపారు.