Rule changes in August | ఆగస్టులో క్రెడిట్ కార్డులు సహా.. ఐటీఆర్ వరకు మారనున్న రూల్స్ ఇవే..! జనం జేబులకు చిల్లులు పడే ఛాన్స్..!
Rule changes in August | జులై నేటితో ముగియనున్నది. రేపటి నుంచి ఆగస్టు మాసం మొదలవనున్నది. నెల మారుతుండడంతో జనంపై ప్రభావం చూపేలా పలు అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే పలు నియమాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, బ్యాంకు సెలవుల్లోనూ మార్పులు ఉంటాయి. అయితే, ఈ ఆగస్టులో క్రిడిట్‌కార్డు రూల్స్‌తో పాటు ఎఫ్‌డీలకు సంబంధించి కీలక మార్పులు ఆగస్టులో చోటు […]

Rule changes in August |
జులై నేటితో ముగియనున్నది. రేపటి నుంచి ఆగస్టు మాసం మొదలవనున్నది. నెల మారుతుండడంతో జనంపై ప్రభావం చూపేలా పలు అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే పలు నియమాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, బ్యాంకు సెలవుల్లోనూ మార్పులు ఉంటాయి.
అయితే, ఈ ఆగస్టులో క్రిడిట్‌కార్డు రూల్స్‌తో పాటు ఎఫ్‌డీలకు సంబంధించి కీలక మార్పులు ఆగస్టులో చోటు చేసుకోబుతున్నాయి. పలు నిబంధనలు మారుతుండడంతో వినియోగదారులపై నేరుగా అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ముందస్తుగానే తెలుసుకోవడం ముఖ్యం. తక్షణం పూర్తి చేయాలనుకుంటున్న పనులు, ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని, లేకపోతే ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉన్నది.
క్రెడిట్‌కార్డు రూల్స్ మార్పు
యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్‌కార్డులో స్వల్ప మార్పులో చేసుకోబోతున్నాయి. యాక్సిస్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగే చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే రివార్డ్ పాయింట్స్ సైతం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంక్ రివార్డ్ పాయింట్లపై కోత విధించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రయాణ సంబంధిత చెల్లింపుల కోసం క్రెడిట్‌కార్డును ఉపయోగిస్తే ఇకపై కేవలం 1.5శాతం మాత్రమే క్యాష్‌బ్యాక్ రానున్నది.
గ్యాస్ ధరల్లో మార్పులు..!
ప్రతి నెలా మొదటి రోజున చమురు కంపెనీలు దేశీయ, వాణిజ్య సిలిండర్ల ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. ఒకసారి ధరలను తగ్గించడమే, పెంచడమో చేస్తుంటాయి. ఆగస్టులోనూ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. దాంతో పాటు పీఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్ ధరల్లోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి.
ఎస్‌బీఐ అమృత్ కలాష్ పథకం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఎఫ్‌డీ పథకం అమృత్ కలాష్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చివరి తేదీ ఆగస్టు 15. ఇది 400 రోజుల టర్మ్ డిపాజిట్ పథకం. ఇందులో సాధారణ డిపాజిటర్లకు 7.1శాతం వడ్డీ ఇవ్వనుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.6శాతం చెల్లించనున్నది. ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లో ముందగానే విత్‌డ్రా చేసుకునే అవకాశంతో పాటు లోన్ సదుపాయం సైతం ఉండనున్నది.
ఐడీఎఫ్‌సీ ఎఫ్‌డీ స్కీమ్
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం అమృత్ మహోతత్సవం ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ ఆగస్టు 15. ఎరైనా ఎఫ్‌డీ చేయాలని ఆసక్తి ఉంటే ఆగస్ట్ 15 వరకు బ్యాంకులో సంప్రదించాలి. లేకపోతే అవకాశాన్ని కోల్పోతారు. అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ 375 రోజులు, 444 రోజులకు ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది. 375 రోజుల ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.60 శాతం వడ్డీ చెల్లించనుండగా.. 444 రోజుల ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.75శాతం ఉండనున్నది.
ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌డీ..
వినియోగదారుల కోసం ఇండియన్ బ్యాంక్ ఐఎన్‌డీ సూపర్ 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీని తీసుకువచ్చింది. ‘IND SUPER 400 DAYS’ స్కీమ్‌లో రూ.10వేల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 31 చివరి తేదీ. ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో సాధారణ డిపాజిటర్లకు 7.25శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ చెల్లించనున్నారు.
అదే సమయంలో ఇండియన్ బ్యాంక్ 300 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో రూ.5వేల నుంచి రూ.2కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఆగస్టు నెలాఖరుతో గడువు ముగియనున్నది. ఇందులో సాధారణ డిపాజిటర్లకు 7.05శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55శాతం వడ్డీ చెల్లించనున్నారు.
బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
ఆగస్టులో బ్యాంకులకు దాదాపు 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతపు సెలవులు కలిసి మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు వెళ్లే పనులు ఉంటే ముందే పూర్తి చేసుకుంటే బెటర్.
జరిమానాతో ఐటీఆర్ ఫైలింగ్
జులై 31తో ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగియనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఫైలింగ్ చేసే వారంతా జరిమానా చెల్లించాల్సి రానున్నది. రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఐటీఆర్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే, ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయడానికి డిసెంబర్ 31, 2023 వరకు గడువు ఉంటుంది. జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినందుకు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234ఎఫ్ కింద రూ.5వేల వరకు ఫైన్ కట్టాల్సిందే. అయితే, వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఎలక్ట్రానిక్ ఇన్ వాయిస్‌లు..
రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ-ఇన్‌వాయిస్‌లను రూపొందించాలని వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రూ.5 కోట్ల కంటే ఎక్కువ బీ2బీ లావాదేవీల విలువ కలిగిన కంపెనీలు ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌లను రూపొందించాల్సి రానున్నది. అన్ని బీ2బీ లావాదేవీల కోసం, కంపెనీలు తమ వార్షిక ఆదాయం రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే.. ప్రస్తుతం ఈ-ఇన్‌వాయిస్‌ను రూపొందిస్తున్నాయి.