Satyam Ramalingaraju | సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?
Satyam Ramalingaraju | ప్రస్తుత తరంలో చాలా మందికి సత్యం కంప్యూటర్స్( Satyam Computers ) అధినేత రామలింగరాజు( Ramalingaraju ) తెలియదు. ఎందుకంటే 2009కి పూర్వం ఒక వెలుగు వెలిగిన రామలింగరాజు.. ఒక చిన్న తప్పిదంతో జైలుపాలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బయటకు కనిపించడం లేదు. కానీ చాన్నాళ్లకు మళ్లీ ఆయన కనిపించారు.

Satyam Ramalingaraju | బైర్రాజు రామలింగరాజు అలియాస్ సత్యం రామలింగరాజు( Satyam Ramalingaraju ).. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే 2009కి పూర్వం సత్యం రామలింగరాజు ఒక సంచలనం. సత్యం కంప్యూటర్స్( Satyam Computers ) పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ( Software Company )ని ఏర్పాటు చేసి.. అప్పట్లోనే కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
1987లో హైదరాబాద్( Hyderabad )లో ఓ చిన్న భవనంలో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ.. 2008 నాటికి ప్రతి ఏడాది రూ. 12 వేల కోట్లు రెవెన్యూ సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆ 20 మంది ఉద్యోగులు కాస్తా 52 వేల మందికి చేరుకున్నారు. దీంతో దేశంలోనే టాప్ 5 కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్( Satyam Computers ) స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఫార్చున్ 500 కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్ 187వ స్థానాన్ని చేజిక్కించుకుంది. కేవలం రూ. 10కి స్టాక్ మార్కెట్( Stock Market )లో లిస్ట్ అయిన కంపెనీ షేర్ ధర ఏకంగా రూ. 544కు పెరిగింది. దేశంలోనే కాకుండా న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్( Newyork Stock Exchange ) లోనూ సత్యం కంప్యూటర్స్ కంపెనీ ట్రేడయ్యేది. ఈ క్రమంలో ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలానుకున్న అప్పటి యువతకు రామలింగరాజు ఎందో ఆదర్శంగా కనిపించేవారు. అంత సామ్రాజ్యాన్ని విస్తరించిన కంపెనీ వ్యవస్థాపకులు రామలింగరాజు చేసిన చిన్న తప్పిదంతో వ్యవస్థ అంతా కుప్పకూలింది. 2009, జనవరిలో సత్యం కుంభకోణం వెలుగులోకి రావడంతో.. చివరకు రామలింగరాజు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
అయితే జైలు జీవితం గడిపిన సత్యం రామలింగరాజు చాలా వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. బహిరంగ వేదికలను కూడా ఆయన పంచుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత జనరేషన్‌కు కూడా సత్యం రామలింగరాజు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రామలింగరాజు పేరు మరోసారి వార్తా పత్రికల్లో నిలిచింది.
తన మనువరాలు శ్రేయా రెడ్డి వివాహానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి( MLA Malla Reddy ) తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajashekar Reddy )తో కలిసి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సత్యం రామలింగరాజును ఆహ్వానించేందుకు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి నిన్న వెళ్లారు. ఈ సందర్భంగా రామలింగరాజుకు ఆహ్వాన పత్రికను అందిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత రామలింగరాజును చూస్తున్నామని నెటిజన్లు పేర్కొంటున్నారు.