SBI | TATA NEU
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16, 2025: భారతదేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డ్ సంస్థ SBI కార్డ్, టాటా డిజిటల్‌తో కలిసి టాటా న్యూ SBI కార్డ్‌ను ప్రారంభించింది. ఈ జీవనశైలి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది. అవి టాటా న్యూ ఇన్ఫినిటీ SBI కార్డ్, టాటా న్యూ ప్లస్ SBI కార్డ్. ఈ కార్డులు ఆన్‌లైన్, దుకాణాల్లో, దేశీయ, అంతర్జాతీయ వ్యాపారుల వద్ద ఖర్చులకు న్యూకాయిన్స్ రూపంలో రివార్డులను అందిస్తాయి. ఈ న్యూకాయిన్స్ టాటా న్యూ యాప్‌లో ఉపయోగించవచ్చు.
టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్‌తో 10% వరకు, టాటా న్యూ ప్లస్ కార్డ్‌తో 7% వరకు న్యూకాయిన్స్ రివార్డులు పొందవచ్చు. ఈ న్యూకాయిన్స్ ప్రతి నెలా కార్డ్‌హోల్డర్ న్యూపాస్ ఖాతాలో జమ అవుతాయి. వీటిని కిరాణా, ప్రయాణ బుకింగ్‌లు, ఆభరణాలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ సేవల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఉపయోగించవచ్చు. ఈ కార్డ్ రోజువారీ చెల్లింపులపై కూడా రివార్డులు ఇస్తుంది. రూపే వేరియంట్‌తో UPI లావాదేవీలపై 1.5% వరకు, టాటా న్యూ ద్వారా బిల్ చెల్లింపులపై 5% వరకు న్యూకాయిన్స్ పొందవచ్చు. కార్డ్ కోసం SBI కార్డ్ SPRINT ద్వారా ఆన్‌లైన్‌లో లేదా క్రోమా దుకాణాల్లోని SBI కార్డ్ కియోస్క్‌లలో ఆఫ్‌లైన్‌లో నమోదు చేయవచ్చు.
SBI కార్డ్ MD & CEO సలీలా పాండే మాట్లాడుతూ… కస్టమర్ల జీవనశైలి మారుతోందన్నారు. టాటా డిజిటల్‌తో భాగస్వామ్యం ద్వారా షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు. ఈ కార్డ్ ప్రతి లావాదేవీలో విలువను జోడిస్తుందని చెప్పారు. టాటా డిజిటల్ MD & CEO నవీన్ తాహిల్యానీ మాట్లాడుతూ… ఈ కార్డ్ ఆధునిక భారతీయ వినియోగదారులకు సౌకర్యవంతమైన, రివార్డింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఇది విశ్వసనీయ బ్రాండ్‌ల శక్తిని కలిపి నిజమైన విలువను అందిస్తుందన్నారు.
టాటా న్యూ మొబైల్ యాప్, వెబ్‌సైట్, ఎయిర్ ఇండియా, బిగ్‌బాస్కెట్, క్రోమా, తాజ్ హోటల్స్, టాటా 1MG, టైటాన్, తనిష్క్, వెస్ట్‌సైడ్ వంటి భాగస్వామి బ్రాండ్‌లలో కొనుగోళ్లపై ఎక్కువ రివార్డులు పొందవచ్చు. టాటా న్యూ ప్లస్ కార్డ్‌పై రూ.1 లక్ష, ఇన్ఫినిటీ కార్డ్‌పై రూ.3 లక్షల వార్షిక ఖర్చుతో వార్షిక ఫీజు రద్దు అవుతుంది. ఈ కార్డ్ దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లకు ఉచిత ప్రవేశాన్ని కూడా అందిస్తుంది.