SBI Loan | ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండా రూ.50 వేల ఎస్బీఐ లోన్.. అర్హులు వీళ్లే..!
SBI Loan | ఈ రోజుల్లో ఖర్చులకు, ప్రజల సంపాదనకు పొంతనే ఉండటంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే సగానికిపైగా సంపద ఆవిరై పోతున్నది. అదనపు సంపాదన కోసం ఏదైనా చిరువ్యాపారం చేద్దామంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి. బయట వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకోవాలంటే అధిక వడ్డీల భయం. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి తీసుకుందామంటే రకరకాల డాక్యుమెంట్‌లు, ష్యూరిటీలు అడుగుతారు.

SBI Loan : ఈ రోజుల్లో ఖర్చులకు, ప్రజల సంపాదనకు పొంతనే ఉండటంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే సగానికిపైగా సంపద ఆవిరై పోతున్నది. అదనపు సంపాదన కోసం ఏదైనా చిరువ్యాపారం చేద్దామంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి. బయట వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకోవాలంటే అధిక వడ్డీల భయం. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి తీసుకుందామంటే రకరకాల డాక్యుమెంట్‌లు, ష్యూరిటీలు అడుగుతారు. ఈ క్రమంలో ఎస్బీఐ మాత్రం ఎలాంటి పత్రాలు, ష్యూరిటీ లేకుండా రూ.50 వేల లోన్ ఇస్తోంది.
ఎస్‌బీఐ అధికారులు ‘శిశు ముద్ర’ స్కీమ్ కింది లోన్ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం కింద రూ.50 వేల రుణం ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువగా రూ.5 లక్షల వరకు లోన్ కావాలంటే ‘కిశోర్ ముద్ర’ కింద, రూ.10 లక్షల వరకు లోన్ కావాలంటే ‘తురుణ్ ముద్ర’ తరుణ్ ముద్ర కింద రుణం అందజేస్తారు. శిశు ముద్ర లోన్ పొందాలనుకునే వారికి కనీస అర్హతలుంటే సరిపోతుంది.
అవేంటంటే.. భారతీయ పౌరులై ఉండాలి. అతడి బ్యాంకు అకౌంట్ 3 సంవత్సాల సీనియారిటీ కలిగి ఉండాలి. ఏదో ఒక చిరు వ్యాపారం చేసేవారై ఉండాలి. ఈ మూడు అర్హతలుంటే.. మిగతా ఎలాంటి డాక్యుమెంటేషన్, ష్యూరిటీతో పనిలేకుండా లోన్ ఇస్తారు. తీసుకున్న రుణం మొత్తాన్ని ఐదేళ్లలోపు చెల్లించాలి. లోన్ కోసం ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. ఈ లోన్‌పై 12 శాతం వడ్డీ విధిస్తారు.