Double Bed Room House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి డెడ్లైన్

డబుల్ బెడ్ రూమ్ లపంపిణీకి తక్షణం చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో

  • By: Tech |    telangana |    Published on : Jan 07, 2026 11:28 PM IST
Double Bed Room House | డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి డెడ్లైన్
  • డబుల్ బెడ్ రూమ్ల పంపిణీకి డెడ్లైన్
  • గృహనిర్మాణ శాఖ పనులపై ప్రత్యేక శ్రద్ధ
  • కూకట్ పెల్లి తరహా వరంగల్ లో ఇళ్ళనిర్మాణం
  • రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

డబుల్ బెడ్ రూమ్ లపంపిణీకి తక్షణం చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండి వి. పి. గౌతమ్ ను ఆదేశించారు. పైలెట్ గా చేపట్టిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అలాగే వాటికి వెంటనే చెల్లింపులు చేయాలని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల ను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని హౌసింగ్ ఏం డి ని ఆదేశించారు. బుధవారం వరంగల్ వచ్చిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఏప్రిల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ళు

ఏప్రిల్ మాసం లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి చెప్పారు. రెండు పడకల గదుల ఇళ్ల (2- బిహెచ్ కె) ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకొని పొజిషన్ లో ఉన్న లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని అన్నారు. ఈనెల 20వ తేదీల్లోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయలైన మంచి నీటి సౌకర్యం తో పాటు విద్యుత్తు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఒక్కసారి లబ్ధిదారులను ఎంపిక చేశాక, ఎల్ 3, ఎల్ 2 అనే సమస్యలు ఉత్పన్నం కాకూడదని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో రెండు పడక గదులకు లబ్ధిదారుల ఎంపిక జనవరి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించిన అన్ని సమస్యలు ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అలాగే ధరణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహించాలన్నారు.

కూకట్ పల్లి తరహా ఇండ్ల నిర్మాణం

హైదరాబాద్ కూకట్ పల్లిలో నిర్మించిన విధంగా హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో కూడా పేద, మధ్య తరగతి వర్గాల కోసం గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు.

ఇవి కూడా చదవండి :

 వరంగల్ సమీక్ష సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరీ

రోడ్లపై పరుగులు తీసే 5స్టార్‌ హోటల్‌.. లంబోర్ఘిని డబుల్‌ డెకర్‌ మోటర్‌హోమ్‌.. విశేషాలివి!!

జిల్లాల పునర్వ్యవస్థీకరణ లోపాల సవరణే: కొత్త జిల్లాలు లేవు