Jagadish Reddy comments| మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు హాస్యాస్పదం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పొంగులేటి తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ది దద్దమ్మ ప్రభుత్వమని ఒప్పుకున్నట్లేనని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 11, 2026, 5:12 pm IST
Read Time: 2 mins
Jagadish Reddy comments| మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు హాస్యాస్పదం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి పొంగులేటి తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ది దద్దమ్మ ప్రభుత్వమని ఒప్పుకున్నట్లేనని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా.. బీఆర్ఎస్సా అన్న సోయికూడా లేకుండా పొంగులేగి మాట్లాడారన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనడం సిగ్గుచేటు అన్నారు.

పోలీసింగ్ లేని చేతగాని ప్రభుత్వమని మంత్రుల మాటల్లో తేటతెల్లమయింది అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హోంశాఖ మంత్రి చేతకానివాడని వాళ్లే నిర్ధారిస్తున్నారు అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు అన్నారు. బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని కాంగ్రెస్ మంత్రులు అపోహ పడుతున్నారు అన్నారు. వారి పాలనా హాయాంలోనూ ట్యాపింగ్ జరుగుతుందని చేతగాని మాటలు చెబుతున్నారు అని జగదీష్ రెడ్డి విమర్శించారు.