(Video) పామును మెళ్లో వేసుకుని తిరిగాడు.. అది కాటేసి పారిపోయింది! మనోడి పరిస్థితి!!
పాములు బొమ్మలు కావు.. మెళ్లో వేసుకుని తిరిగే అలంకారాలు కూడా కావు.. మీ వీడియోలను వైరల్ చేసే సాధనాలు అంతకంటే కాదు.. పాములు పాములే.. వాటిని దూరం నుంచి చూడొచ్చు తప్పులేదు.. అంతే దూరం నుంచి ఫోటో కూడా తీసుకోవచ్చు.. కానీ.. సరదాపడి దానిని దగ్గరకు తీసుకుని ఎదవ్వేషాలేశారో.. కాటేసి పోద్ది!
Snake Bite Viral | గొప్పలు పోవాలనుకుంటే మెళ్లో బంగారు గొలుసు వేసుకోవాలి. కానీ.. ఈ సారుగారికి ఏకంగా పామును మెళ్లో వేసుకుని తిరగాలని అనిపించింది. అయితే.. అది స్టైల్ కాదని.. స్ట్రెచర్ మీదకు తీసుకుపోయే షార్ట్‌కట్ అని ఆ పాము కాటేస్తేకానీ ఆ యువకుడికి తెలిసిరాలేదు! ఎక్‌స్ట్రాలు చేస్తే.. పరిణామాలు కూడా కొంచెం ఎక్‌స్ట్రాగానే ఉంటాయని అతడు అర్ధం చేసుకోక తప్పలేదు.
ఇది ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఒక యువకుడు పాముతో అడిన సయ్యాట కథ! సుబల్ సాహు అనే వ్యక్తికి ఒక అరుదైన పాము కనిపించింది. మత్తు ప్రభావంలో ఉన్నాడో మరేమోగానీ.. దానిని తీసుకుని మెళ్లో వేసుకొని మార్కెట్ సెంటర్‌లో అటూ ఇటూ దర్జాగా తిరిగాడు. తనకు పాములంటే భయం లేదని చాటుకోవడానికో లేదా వీడియో తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడానికో ఏదైతేనే.. పెద్ద సాహసమే చేశాడు. కానీ అది ఒక అరుదైన, అతి విషపూరితమైన పాము అని తెలియలేదు. ఆ పాముతో ఆడుకునే సమయంలో అది ఒక్కసారిగా కాటు వేసింది. అసలే అత్యంత విషపూరిత పాము కావడంతో దెబ్బకు ఒంటిలోకి విషం ఎక్కింది. క్షణాల్లోనే పరిస్థితి విషమించడంతో స్థానికులు అతడిని హుటాహుటిన జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.
కాటేసిన పామును వైద్యులు గుర్తించేందుకు వీలుగా ఆ పామును కూడా పట్టుకొని వెళ్లారు. అయితే.. వైద్యులు అది ఏ జాతి పామో గుర్తించలేక పోయారు. ఆ లోపు ఎంట్రీ ఇచ్చిన స్నేక్ హెల్ప్‌లైన్ టీమ్ సభ్యులు.. దానిని పరిశీలించి.. అది సాధారణ పాము కాదని, ఇంటర్నేషనల్ స్టార్ పాము అని గుర్తించారు. వారు చెప్పిన దాని ప్రకారం.. అది అల్బినో బ్యాండెడ్ క్రెయిట్ జాతి పాము. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పాము కూడా.
కాస్త బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళితే.. ఇటీవలే అతడు బంటా బ్లాక్ పలాసలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కదల్లేని పరిస్థితిలో పడి ఉన్న ఒక అందమైన పాము కనిపించింది. అదేదో ప్రమాదం లేని పాము అనుకున్న సుబాల్.. దానిని తీసుకొని బ్యాగులో వేసుకున్నాడు. పైగా.. మార్కెట్ వద్దకు వచ్చిన తర్వాత జనానికి తన పవర్ చూపించేందుకు ఆ పామును మెళ్లో వేసుకుని తిరిగాడు. ఈ సమయంలో అభద్రతాభావానికి గురైనా పాము అతడిని పదే పదే కాటు వేసింది. విషరహిత పాము అన్న ఫీలింగ్‌లో ఉన్న సాహు.. దానిని పట్టించుకోకుండా ఆటలు ఆడాడు. కానీ.. కాసేపటికే సీన్ సితార అయ్యింది.
కాసేపలా దాన్ని పక్కనపెడితే.. హాస్పిటల్‌కు డబ్బాలో తీసుకువచ్చిన ఆ అరుదైన పాము.. ఉన్నట్టుండి మాయమైపోయింది. దీంతో అదెక్కడ దూరిందో.. మళ్లీ ఎవరిని కాటు వేస్తుందోనని అంతా హడలిపోయారు. ఇదెలా ఉన్నా.. భారతదేశంలో చాలా అరుదుగా, విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము.. ఒడిశాకు ఎలా వచ్చిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అక్రమ రవాణాలో భాగంగా ఇది ఇక్కడికి వచ్చిందనే అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పాములకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్‌ఉంటుందని స్నేక్ హెల్ప్‌లైన్‌కు చెందిన సుభేందు మాలిక్ తెలిపారు. ఈ పాము ఇక్కడ ఎందుకు కనిపించిందనే విషయంలో అటవీశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు.
ఏతావాతా చెప్పేదేంటంటే.. పాములు బొమ్మలు కావు.. మెళ్లో వేసుకుని తిరిగే అలంకారాలు కూడా కావు.. మీ వీడియోలను వైరల్ చేసే సాధనాలు అంతకంటే కాదు.. పాములు పాములే.. వాటిని దూరం నుంచి చూడొచ్చు తప్పులేదు.. అంతే దూరం నుంచి ఫోటో కూడా తీసుకోవచ్చు.. కానీ.. సరదాపడి దానిని దగ్గరకు తీసుకుని ఎదవ్వేషాలేశారో.. కాటేసి పోద్ది! భద్రక్‌లో సుబల్ సాహును స్ట్రెచ్‌ర్ మీదకు ఎక్కించినట్టే!!
Most Read Snake News |
Blue Snake Video : అద్భుతం.. నీలి రంగు పాము వీడియో వైరల్
Snake Venom | భారీగా పట్టుబడిన పాము విషం.. విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Snakes Brumation | చలికాలంలో పాములు ఎక్కడ ఉంటాయి? వాటిని కాపాడే బ్రూమేషన్ అంటే ఏంటో తెలుసా?.
Titanoboa Prehistoric Serpent | టైటానోబోవా! 45 అడుగుల పొడవు.. 2,500 పౌండ్ల బరువున్న పామును చూశారా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram