Snake Venom | భారీగా పట్టుబడిన పాము విషం.. విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
జార్ఖండ్ రాష్ట్రం పలమావు ప్రాంతంలో భారీఎత్తున అక్రమంగా నిల్వ చేసి ఉన్న పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నాల్లో ఉండగా అధికారులు మాటువేసి.. పట్టుకున్నారు. మార్కెట్‌లో ఈ పాము విలువ చాలా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Snake Venom | రాత్రికి రాత్రే పెద్దమొత్తంలో డబ్బు సంపాదించేందుకు కొందరు స్మగ్లింగ్‌ను ఎంచుకుంటుంటారు. తమ ప్లాన్లను మించి ప్లాన్లు వేసే అధికారులు కూడా ఉంటారని తెలియక దొరికిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పలమావు టైగర్ రిజర్వ్ (PTR), వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జాయింట్ టీమ్ ఒకటి.. భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్న పాము విషాన్ని పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధర వింటే కళ్లే తేలేయడం ఖాయమని అధికారులు అంటున్నారు. నిజానికి పాము విషం చాలా ప్రమాదకరమైనది. హెర్పటాలజిస్టులు ఎంపిక చేసిన ప్రయోగశాలల్లో పాముల నుంచి విషాన్ని తీస్తూ ఉంటారు. ఈ విషాన్ని పాము కాటు విరుగుడు ఇంజక్షన్లతోపాటు.. కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఈ విషాన్ని సేకరించే ప్రక్రియ ఎంతో ప్రమాదకరమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు దక్కవు. అంతటి ప్రమాదకరమైన ప్రక్రియను కొందరు అక్రమంగా నిర్వహిస్తూ విషాన్ని తీసి, బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తూ ఉంటారు.
Snakes Brumation | చలికాలంలో పాములు ఎక్కడ ఉంటాయి? వాటిని కాపాడే బ్రూమేషన్ అంటే ఏంటో తెలుసా?
తాజాగా జార్ఖండ్‌లో పట్టుబడిన విషం విషయానికి వస్తే.. మొత్తం ఒక కిలో 200 గ్రాములు ఉందని పీటీఆర్ అధికారులు తెలిపారు. ఈ విషాన్ని స్థానికంగా సేకరించి, విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేసి ఉంచారు. ఈ విషంతోపాటు.. రెండున్నర కిలోల బరువున్న పాంగోలిన్ చర్మాన్ని కూడా అధికారులు ఈ ఆపరేషన్ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. పలమావు ప్రాంతంలో అక్రమంగా పాము విషం వ్యాపారం జరుగుతున్నదని తమకు విశ్వసనీయ సమాచారం అందిందని పీటీఆర్ అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిలో తండ్రీ, కొడుకు కూడా ఉన్నారు. ‘ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది. స్థానికంగా సేకరించిన విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. వీటిని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తాం’ అని పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రజేశ్‌కాంత్ జెనా మీడియాకు చెప్పారు. స్వాధీనం చేసుకున్న విషం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 80 కోట్ల రూపాయలు ఉంటుందని, పాంగోలిన్ చర్మం 20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఔషధాల కోసం ఉపయోగించే పాము విషం.. ఒక గ్రాము అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 8 లక్షల రూపాయలు పలుకుతుందని సమాచారం.
Asian Water Snake | అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
అరెస్టయినవారిలో బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన దేవ్ ప్రాంత వాసి ముహమ్మద్ సిరాజ్ (60), ఆయన కుమారుడు మిరాజ్ (36), పలమావులోని హరిహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాఖో ప్రాంత వాసి రాజు కుమార్ షుండిక్ (50) ఉన్నారు. కొంతకాలంగా పలమావులో పాము విషంతో వ్యాపారం జరుగుతున్నదని అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న అధికారుల.. మాటువేసి, సమయం కోసం ఎదురు చూశారు. కొన్ని రోజులపాటు నిందితులపై నిఘా పెట్టి.. పూర్తిగా ధృవీకరించుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట తండ్రీ కొడుకులను బీహార్ లో అరెస్టు చేశారు. అనంతరం రాజు కుమార్ షుండిక్‌ను హరిహర్‌గంజ్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. రాజు అధికారికంగా బెల్లం వ్యాపారం నిర్వహిస్తూ, అక్రమంగా పాము విషాన్ని స్మగుల్ చేస్తున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. స్థానికంగా విషాన్ని సేకరించి, దానిని అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నామని నిందితులు ఇంటరాగేషన్ సందర్భంగా అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములైన మొత్తం నెట్‌వర్క్ గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు.
Cobra Capital of India | భారతదేశపు కింగ్ కోబ్రాల రాజధాని ఎక్కడుందో తెలుసా?
ఇదే సోదాల్లో స్వాధీనం చేసుకున్న పాంగోలిన్ పొలుసులు కూడా మార్కెట్‌లో ఖరీదైనవి. వీటిని కూడా చైనా, వియత్నాం తదితర దేశాల్లో వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. దీంతో వాటికి అంతర్జాతీయ భారీ డిమాండ్ ఉన్నది.
Read Also |
Hujurabad | ఈటల వర్సెస్ బండి : స్థానికంపై లీడర్ల పంచాయితీ!
Special Intensive Revision | ‘సర్’ మోగిస్తున్న మరణ మృదంగాలు! పని ఒత్తిడితో తాజాగా గుజరాత్‌లో బీఎల్‌వో బలవన్మరణం
India Born Cheetah Mukhi : మన చీతా తల్లైంది…’ప్రాజెక్ట్ చీతా’లో చారిత్రక ఘట్టం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram