Gold And Silver Price : వెండి మరింత పైపైకి..ఒక్క రోజే రూ.9వేల పెంపు!

ఒక్క రోజులోనే వెండి ధర రూ.9వేలు ఎగిసింది. వెండి పరుగు కొనసాగుతుండగా బంగారం ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Nov 29, 2025, 1:26 pm IST
Read Time: 1 mins
Gold And Silver Price : వెండి మరింత పైపైకి..ఒక్క రోజే రూ.9వేల పెంపు!

విధాత : బంగారం ధరలతో వెండి పోటీ పడుతుంది. ఒక్క రోజునే కిలో వెండిపై రూ.9వేలు పెరిగింది. శనివారం మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1లక్షా 92వేలకు చేరింది. నవంబర్ 24న రూ.1లక్షా 71వేలు ఉన్న కిలో వెండి ధర ఐదురోజుల్లోనే రూ.21వేలు పెరుగడం సంచలనం రేపింది. వెండి ధరల పరుగు చూస్తే..కేజీ వెండి 2026లో రెట్టింపు కావడం తధ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే బంగారం ధర శనివారం 24క్యారెట్ల 10గ్రాముల ధర 1360పెరిగి రూ.1లక్షా 29,820కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1లక్షా 19వేలుగా కొనసాగుతుంది.