Stock Market | కొత్త రికార్డుల దిశగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 25వేల పాయింట్లకు చేరువైన నిఫ్టీ

Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,679.65 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో మొదలైంది.

Stock Market | కొత్త రికార్డుల దిశగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 25వేల పాయింట్లకు చేరువైన నిఫ్టీ

Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,679.65 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో మొదలైంది. నిఫ్టీ సైతం 125.70 పాయింట్లు లాభపడి 24,943.30 పాయింట్లకు వద్ద ట్రేడవుతున్నది. ప్రస్తుతం సెన్సెక్స్ 469.15 పాయింట్ల లాభంతో 81,801.87 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 138.90 పాయింట్ల లాభంతో 24,970 పాయింట్లకు చేరుకొని తొలిసారిగా ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ మొదటిసారి 25వేల మార్కెట్‌ను తాకే అవకాశలున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సెన్సెక్స్‌ సైతం 82వేల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

నిఫ్టీలో లార్సెన్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, రియలన్స్‌, టాటాస్టీల్‌, అదానీ పోర్ట్స్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, టైటాన్‌ కంపెనీ, సిప్లా, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్ గ్రిడ్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆసియా మార్కెట్లు సైతం భారీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ధర 81.30 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా రూ.2,546 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.2,774కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. కాగా, జూలై 30-31 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ సమావేశం జరుగబోతున్నది. ఈ సారి వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.